“”చిన్న నిర్మాత”గా మారుతున్న “బడా దర్శకులు”!

Koratala Siva - to become -produserటాలీవుడ్ లో టాలెంట్ ఉన్న దర్శకుల్లో సుకుమార్ ఒకడు అయితే దర్శకత్వం చేస్తూనే చిన్న సినిమాల నిర్మాతగా మారాడు సుకుమార్. కుమారి 21ఎఫ్ తో భారీ హిట్ అందుకున్న సుకుమార్ త్వరలో మరి సినిమాను నిర్మించనున్నాడు అని తెలుస్తుంది.

[m9ad]

ADVERTISEMENT

అయితే మరో పక్క చిన్న దర్శకుడిగా మొదలయ్యి హిట్ దర్శకుడిగా మారిన మారుతి సైతం చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూ ఒక పక్క దర్శకుడిగా, మరో పక్క నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

అంతెందుకు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడిగా పేరుగాంచిన రాజమౌళి కూడా “అందాల రాక్షసి” సినిమాని సమర్పించాడు…అయితే ఇక ఆ కోవలోకే వచ్చి చేరనున్నాడు మరో టాప్ దర్శకుడు కొరటాల శివ…తన తర్వాత సినిమా మెగాస్టార్ తో ఫిక్స్ అయినప్పటికీ సైరా సినిమా లేట్ అయ్యేలా ఉండడంతో దాదాపుగా మరో ఏడాది పాటు కొరటాల ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.

ఇక ఈ లోపు తాను నిర్మాతగా మారి చిన్న సినిమాలను తన సమర్పణలో విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నట్లు..తన స్నేహితుడితో కలసి చిన్న సినిమాలను నిర్మించాలి అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే మెగాఫోన్ పట్టుకున్న బడా దర్శకులు అంతా చిన్న సినిమాల నిర్మాతలుగా మారుతున్నారు అని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories