నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపి, జనసేన ముఖ్యనేతలను టార్గెట్ చేసుకొని ఎటువంటి రాజకీయాలు చేసిందో అందరికీ తెలుసు. కానీ ఆ రెండు పార్టీల పొత్తుల వలననే వైసీపీ రాజకీయంగా చావుదెబ్బ తినడం విశేషం.
కనుక వాటి పొత్తు, సఖ్యత తమకు భవిష్యత్‌లో కూడా నష్టమే అని గట్టిగా నమ్ముతున్న వైసీపీ, వాటి మధ్య చీలిక తెచ్చి విడగొట్టేందుకు చేయని ప్రయత్నాలు లేవు.
అయితే నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో డక్కాముక్కీలు తిని రాటు తేలిన టీడీపిని ఇప్పుడు బలహీన పరచడం, దెబ్బతీయడం చాలా కష్టం. పైగా అటువంటి ప్రయత్నాలు చేసిన ప్రతీసారి చేతులు కాల్చుకుంది. బహుశః అందుకే జనసేన దానికి ‘సాఫ్ట్ టార్గెట్ ’ మారిందనుకోవచ్చు.
మంగళగిరిలో కైరెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో, జనసేన మహిళా నాయకురాలు కోట రుక్మిణి పేరుతో చేస్తున్న దుష్ప్రచారం ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆమె సంస్థలో పని చేస్తున్న బోడపాటి ధరణీ కృష్ణ అనే ఓ మహిళా ఉద్యోగి, పెద్దిరాజు అనే మరో వ్యక్తితో కలిసి దేవాదాయ, పోలీసు శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుమారు 34 మంది నిరుద్యోగుల నుంచి రూ.7 కోట్లు వసూలు చేశారు.
జనసేన మహిళా నాయకురాలు కోట రుక్మిణి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్‌లతో తమకు మంచి పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి డబ్బు దండుకున్నారు. ఈవిషయం కోట రుక్మిణి దృష్టికి రావడంతో వెంటనే ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఆ తర్వాత కోట రుక్మిణి, శివ శ్రీనివాస్ వేర్వేరుగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో వారిపై పిర్యాదు చేశారు.
కానీ అసలు నిందితులను వదిలేసి తనను నేరస్తురాలిగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కోట రుక్మిణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం తన గురించి ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా సహించానని, ఇకపై సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
రాజకీయ దురుదేశ్యంతో తన ప్రతిష్ఠ, కుటుంబ గౌరవాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ కోట రుక్మిణి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపి నేతలు, టీడీపి మద్దతుదారుల ఆర్ధిక మూలాలను దెబ్బ తీసి వారిని రాజకీయంగా బలహీనపరచాలని ప్రయత్నించిన దాఖలాలున్నాయి. ఇప్పుడు ఈవిధంగా జనసేనలో మహిళా నేతలను టార్గెట్ చేసుకొని వారిపై సోషల్ మీడియాలో బురద జల్లుతూ, రాజకీయాలంటే భయపడేలా చేసి తమంతట తామే బయటకు వెళ్ళిపోయేలా చేస్తున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయినా వైఎస్ షర్మిల, విజయమ్మలపైనే సొంత మీడియా, సోషల్ మీడియాలో రోత రాతలు వ్రాసినప్పుడు, బయటవారు ఏపాటి?
Over the years, I have learnt from my leader, inspiration and mentor, Sri.Pawan Kalyan garu, that challenges and obstacles are inevitable on the path of Dharma. His indomitable spirit, resilience and patience have taught me to remain steadfast in my principles and values, stand with courage in the face of adversity and never allow any challenge to weaken my resolve.
I am, and shall forever remain, a deeply committed Janasainik.
Jai Hind.
#SatyamevaJayate— Rukmini Kota (@kotarukmini) November 18, 2026




