
ఎక్కడో కోపం, మరెక్కడో ఎమోషన్ కేటీఆర్ ఇక్కడ చూపిస్తున్నారా.? చెల్లి కవితని అడ్డుకోవడం రాక రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఆ పార్టీ అధినాయకత్వం పై రెచ్చకొట్టేలా కేటీఆర్ చేస్తున్న ఈ వ్యాఖ్యల వెనుక బిఆర్ఎస్ కి రాజకీయ వ్యూహం ఉందా.?
కావాలనే కేటీఆర్ రేవంత్ ని, రాహుల్ గాంధీని హౌలే గాడు అంటూ మాట్లాడుతూ వారిని రెచ్చకొట్టేందుకు సిద్దమయ్యారా.? ఇన్నాళ్లు ఆచితూచి వెళ్లిన గులాబీ కారు ఒక్కసారిగా విమర్శల వేగం పెంచడం వెనుక ఉన్నది బలమా.? భయమా.? భరోసానా.?
కేసీఆర్ గోడకు తగిలించిన తుపాకీ వంటి వాడు, అది ఎప్పుడైనా పేలుతుంది, ఎవరి పైనైనా పేలుతుంది అంటూ కేటీఆర్ ఇచ్చిన ప్రకటనలకు గాను కేసీఆర్ 2025 కి వీడ్కోల మాటల వలే ఒకేఒక్కసారి మీడియా ముందుకొచ్చి తోలుతీస్తా అంటూ అధికార పార్టీ నేతల పై పేలారు.
అలాగే రెండేళ్ల నుంచి అసెంబ్లీ గడప తొక్కని కేసీఆర్ ఈఏడాది చివరిలో తన విలువైన సమయంలో కేవలం 5 అంటే 5 నిముషాలు మాత్రమే అసెంబ్లీ కి కేటాయించారు, ఒకే ఒక్క సంతకంతో ప్రజా సమస్యల నుండి పక్కకు తప్పుకున్నారు. దీనితో మళ్ళీ కేసీఆర్ తుపాకీ గోడ ఎక్కేసింది.
ఇక అప్పటి నుంచి రేవంత్ vs కేసీఆర్, రేవంత్ vs కేటీఆర్ అంటూ మొదలైన రాజకీయ యుద్ధం ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా దూషించుకునే స్థాయి వరకు వెళ్ళిపోయింది. ఒకరు ముఖ్యమంత్రి తోలుతీస్తా అంటూ రెచ్చకొడుతుంటే మరొకరు నాలుక కోస్తా, ఉరి తీయాలి అంటూ రెచ్చిపోతున్నారు.
ఒకరు సన్నాసి అంటూ తన ప్రత్యర్థిని దూషిస్తుంటే మరొకరు హౌలే అంటూ రెచ్చిపోతున్నారు. అయితే ఇక్కడ రాజకీయం హద్దులు దాటుతుంది, విమర్శలు పరిధి దాటిపోతున్నాయి, కనీసం ప్రజాస్వామ్య పదవులకు కూడా గౌరవం, మర్యాద లేకుండా పోతుంది.
అసలు కేటీఆర్ లో పెరిగిన ఈ రాజకీయ వేడికి కారణం ఎవరు.? ఏంటి.? తన పార్టీ నేతల మీద, బిఆర్ఎస్ ప్రభుత్వం మీద అవినీతి మరకలు వేస్తూ ఇంటి గుట్టుని మీడియాలో పెడుతున్న కవిత ఆరోపణలను పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే కేటీఆర్ తన మాటలతో ఈ విధంగా రేవంత్ ని రెచ్చకొట్టి అటు మీడియా అటెన్షన్ తో పాటు ఇటు ప్రజలను డైవర్షన్ చేస్తున్నారా.?
కవిత విమర్శలు తెలంగాణ ఓటర్లను ప్రభావితం చెయ్యకూడదని, ఆమె బిఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణలు ప్రజలలో చర్చ జరగకూడదని, కవిత అరెస్టు నుంచి ఆ అరెస్టు పై బిఆర్ఎస్ నుంచి వచ్చిన స్పందన వరకు, బీజేపీ తో జరిగిన తెరచాటు మంతనాల నుంచి, కాంగ్రెస్ తో ఉన్న అంతర్గత సంబంధాల వరకు కవిత బిఆర్ఎస్ ని ఇరుకునపెట్టేలా దూసుకుపోతుంది.
ఇక తాజాగా శాసనమండలి లో కవిత చేసిన ప్రకటనలు, ఆమె ప్రదర్శించిన భావోద్వేగాలు అన్ని కూడా నిత్యం మీడియాలో సందడి చేస్తున్నాయి, ప్రత్యర్థి పార్టీల నేతలకు బలమైన ఆయుధాలను అందిస్తుంది. వీటన్నినీ డైవర్ట్ చెయ్యడంలో భాగంగా కేటీఆర్ తన వ్యాఖ్యలతో, విమర్శలతో ఇలా ముఖ్యమంత్రి రేవంత్ ని రెచ్చకొడుతున్నారా.?
లేక అటు మీడియా ఇటు ప్రజల అటెన్షన్ ని కవిత నుంచి తనవైపుకు తిప్పుకోవడానికి కేటీఆర్ ఇలా రాజకీయ హద్దులను చెరిపేసి మరి రెచ్చిపోతున్నారా.? కేటీఆర్ ఈ ప్రయత్నాలు అటెన్షన్ కోసమా.? డైవర్షన్ కోసమా.?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…