Telugu

అవి చంద్రబాబుతో దోస్తీకి సంకేతాలా?

ఊరకరారు మహానుభావులు అన్నట్లు, హరీష్‌ రావు, కేటీఆర్‌ హటాత్తుగా కొత్త మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ అమితంగా ద్వేషించే సిఎం చంద్రబాబు నాయుడుని ఇద్దరూ పొగుడుతుండటం చాలా ఆశ్చర్యం కాదు ‘దిగ్బ్రాంతి’ కలిగిస్తుంది.

కృష్ణ, గోదావరి నీళ్ళు ఎత్తిపోసుకుంటే విషయంలో వారు తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో పోల్చి చెపుతూ పొగుడుతున్నారు… అని అనిపిస్తుంది. కానీ వారి ద్వారా చంద్రబాబు నాయుడుకు కేసీఆర్‌ ఏమైనా సిగ్నల్స్ పంపిస్తున్నారా? అనే అనుమానం కూడా కలుగుతోంది.

ADVERTISEMENT

ఎందుకంటే, అక్కడ కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలతోనే బీఆర్ఎస్‌ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే చిన్న ఆశ తప్ప, సొంత బలంతో, ప్రజాధరణతో వస్తుందనే నమ్మకం వారి మాటల్లో కనిపించదు. అలాగే చంద్రబాబు నాయుడుని తిట్టిపోస్తూ ‘తెలంగాణ సెంటిమెంట్’ రగిలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. తెలంగాణ ప్రజల తీరు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం, మరోపక్క కేసీఆర్‌ ఫామ్‌హౌసు వదిలిరాకపోవడం బీఆర్ఎస్‌ పార్టీకి చాలా నిరాశ కలిగించే విషయాలే.

సీజేపీ ఆందోళనలకు మద్దతు తెలిపి ఇండియా కూటమితో కలిసి పనిచేసేందుకు సిద్దపడినా రాష్ట్రంలో రేవంత్ రెడ్డితో కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపే పరిస్థితి లేదు. అలాగని సింగిల్ సింహంలా పోరాడే శక్తి కూడా లేదు. బహుశః ఈ నిర్వేదంతోనే కేటీఆర్‌ కూడా ఇప్పుడు గెడ్డాలు, మీసాలు పెంచుకొని తిరుగుతున్నారేమో?

కాంగ్రెస్‌ కాకుంటే బిజేపి ఉండనే ఉంది. బిజేపికి దూరంగా ఎల్లకాలం ఫామ్‌హౌసులో కాలక్షేపం చేయడం కూడా కష్టమే. కనుక ఎన్డీయేలో చేరేందుకుగాను చంద్రబాబు నాయుడుతో దోస్తీకి సిద్ధమని సిగ్నల్స్ ఇస్తున్నారేమో? అని సందేహం కలుగుతోంది.

ఇందుకు మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. ‘చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిపోతోందని, ఎక్కడ చూసినా కరువు తాండవిస్తోందని’ జగన్‌ వాదిస్తుంటే, ఆయనను పెద్దన్నగా భావించే కేటీఆర్‌, కేసీఆర్‌ రైట్ హ్యాండ్ హరీష్‌ రావు ఇద్దరూ పోటాపోటీగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఈవిధంగా పొగిడేస్తున్నారు. అందుకే ఈ అనుమానం!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Janhvi’s Peddi Comments Backfire? Old Clips Resurface

Janhvi Kapoor’s comments about her role in Ram Charan’s Peddi on Koffee With Karan have…

20 minutes ago

అరే చంద్రబాబుని పొగిడేస్తున్నారే! ఏమయిందో పాపం!

అవును. ఈ మాట అన్నది ఆయనను ద్వేషించే బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా…

24 minutes ago