
KTR Watches Nani's The Paradise
‘తెలంగాణ’ అనే ఈ ఒక్క పదం ఇన్నాళ్ళుగా రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యింది, రాజకీయ నాయకులకు మాత్రమే అస్త్రంగా మారింది అనుకున్నారు, కానీ ఇప్పుడా ఆ పదం తన పరిధిని విస్తరించుకుంటూ సినీ పరిశ్రమ వైపు అడుగులేస్తుందా.? అన్న చర్చ మొదలయ్యింది.
ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ సినిమా టైటిల్ తో ఈ భావన బయటకొచ్చింది. అసలు ఇడుపు కాగితం అంటే అర్ధం ఏంటనే ప్రశ్న లేవనెత్తిన మరుక్షణమే దాన్ని తమ రాజకీయానికి అనుకూలంగా మలుచుకునేందుకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత రంగ ప్రవేశం చేసారు.
ఇడుపు కాగితం అర్ధం తెలియాలంటే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అడగాలని, తెలంగాణ భాష పట్ల ఆంద్రోళ్ళకి ఇంతటి వివక్షా అంటూ ఇడుపు కాగితం టైటిల్ పై మొదలైన వివాదాన్ని రాజకీయ అంశంగా మార్చి, దానికి ప్రాంతీయవాదాన్ని జోడించి మొత్తానికి తెలంగాణ అనే పదం చుట్టూ చర్చను కొనసాగించారు.
ఇక తాజాగా ది పారడైజ్ అంటూ ఈ నెల 23 ప్రీమియర్స్ షో లతో నాని ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ బయటకొచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మూవీ మంచి నెంబర్స్ నే నమోదు చేసుకుంది. అయితే ఈ చిత్రం పై వచ్చిన మిక్స్డ్ టాక్ కు కూడా తెలంగాణ చిత్రం పై ఇంతటి నెగటివిటీ నా అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలయ్యింది.
ఇదిలా ఉంటే ఇప్పుడా చిత్రం చూసేందుకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తి చూపించడంతో చర్చ మరో వైపుకి మళ్లింది. ఈ చిత్రం కూడా తెలంగాణ నేపధ్యానికి చెందిన కథాంశంతో తెరకెక్కడం, చిత్ర దర్శకుడు కూడా తెలంగాణ వాసి కావడం, చిత్రంలో ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్ర కేటీఆర్ తండ్రి కేసీఆర్ ని పోలి ఉండడంతో సహజంగా ఈ సినిమా పై కూడా తెలంగాణ అనే పొర ఏర్పడింది.
తానూ అభిమానించే నటులలో ఒకరైన నాని నటించిన, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ది పారడైజ్ వీక్షించేందుకు కొన్ని సంవత్సరాల తరువాత ధియేటర్ కి వెళుతున్నానంటూ కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో నాని కోసమా.? శంకరన్నా కోసమా.? అంటూ కామెంట్స్ మొదలయ్యాయి.
అయితే కేటీఆర్ ది పారడైజ్ పట్ల ఎందుకుఇంత స్పెషల్ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు అంటే అది కేవలం చిత్రంలో ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్ర కోసమే అన్న వాదన వినిపిస్తుంది. శంకరన్న పాత్ర కేసీఆర్ ని పోలి ఉండడం, ఆ పాత్ర చిత్రంలో చెప్పే డైలాగ్స్ కూడా కేసీఆర్ ని గుర్తుకు తేవడం కేటీఆర్ దృష్టిని ఆకర్షించి ఉండవచ్చు.
అయితే సినిమా ని సినిమాలా చూసి ఆనందించడం, విమర్శించడం వరకు ఒకే, అది టాలీవుడ్ అభిమాని అయినా, సినీ ప్రేమికుడైన, చివరికి రాజకీయ నాయకుడైనా కూడా. సినీ పరిశ్రమలో నటులను, దర్శకులను ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు. అది వారి ఎదుగుదలకు కంచెగా మారుతుంది. కాబట్టి సినీ పరిశ్రమకు కూడా తెలంగాణ, ఆంధ్రా అనే ప్రాంతీయవాద కంచె వేయకుండా ఉంటే చాలు అంటున్నారు టాలీవుడ్ అభిమానులు.
The controversy around Govinda's alleged affair with Komal Rani Swarnkar is refusing to die down.…
Very rarely do we see a capital area or an entire region being specifically targeted…