
2023 ఎన్నికలలో పార్టీ ఓటమి నుంచి బిఆర్ఎస్ రాజకీయ బాధ్యతలను కేసీఆర్ తనయుడు కేటీఆర్ భుజాన మోస్తున్నారు. కనీసం ప్రతిపక్ష నేత హోదాలో కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. అలాగే ఇటు పార్టీ అధినేతగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు.
బిఆర్ఎస్ లో కర్త, కర్మ, క్రియ అన్ని తానే అయి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ ఎంతలా ప్రయత్నిస్తున్నా బిఆర్ఎస్ రాజకీయంలో కేసీఆర్ కనిపించని లోటు, ఆయన గొంతు వినిపించని లోటు స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే ఇక్కడ బిఆర్ఎస్ అధికారానికి దూరమైన ఎమ్మెల్యే గా కేసీఆర్ మాత్రం విజయం సాధించారు. అయినా కూడా కేసీఆర్ పొలిటికల్ గా ఇన్ యాక్టీవ్ అయ్యారు. కానీ డీఎంకే విషయంలో ఇందుకు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ డీఎంకే ఓటమితో పాటుగా పార్టీ అధినేత, మాజీ సీఎం స్టాలిన్ ను సైతం ప్రజలు తిరస్కరించారు.
దీనితో ఇప్పుడు డీఎంకే ను ముందుండి నడిపించ్చాల్సిన బాధ్యత స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ భుజాన పడింది. మరి ప్రతిపక్ష నేత హోదాలో ఉదయనిధి పార్టీని రాజకీయంగా ఎంత మేరకు ముందుకు తీసుకెళ్లగలరు.? ప్రజలకు పార్టీని ఈమేరకు చేరువ చెయ్యగలరు అనేది చూడాలి.
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్టాలిన్ లేని లోటును ఉదయనిధి తో డీఎంకే ఎలా భర్తీ చేయగలుగుతుంది.? విజయ్ పై ఎలా పై చేయి సాధించగలుగుతుంది.? సీఎం గా విజయ్ కి ప్రతిపక్ష నేతగా ఉదయనిధికి ఇది తొలి అవకాశం కావడంతో ఇందులో ఎవరు నెగ్గుతారు.? ఎవరు తగ్గుతారు అనేది ఆసక్తిగా మారింది.
కేటీఆర్ విషయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి కూడా రాజకీయ నేతగానే ప్రజలకు సుపరిచితుడు. కానీ ఉదయనిధి విషయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి తమిళ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ డం ఉన్న అగ్ర హీరో, ఆయనకు పొలిటికల్ ఛరిష్మా తో పాటుగా సినీ గ్లామర్ కూడా అదనపు బలం.
తెలంగాణలో కేటీఆర్ – రేవంత్ ఇద్దరి బ్యాక్ గ్రౌండ్ ఓన్లీ రాజకీయాలు మాత్రమే. కానీ తమిళనాట విజయ్ – ఉదయనిధి ఇద్దరు కూడా రాజకీయ నాయకుల కంటే ముందు సినీ ఇండస్ట్రీ హీరోలు. అయితే రేవంత్ కన్నా ప్రభుత్వ పాలనలో సీనియర్ అయినా కేటీఆర్ కేసీఆర్ ని మరిపించలేకపోయారు, మరి పొలిటికల్ గా విజయ్ కంటే సీనియర్ అయిన ఉదయనిధి, తన తండ్రి స్టాలిన్ స్థానాన్ని భర్తీ చేయగలరా.?
కేసీఆర్ లేని బిఆర్ఎస్ తెలంగాణ లో ఉనికి కోసం పోరాడుతున్నట్టు, స్టాలిన్ లేని డీఎంకే తమిళనాడు రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో రానున్న రోజులలో తేలుతుంది.
The proposed 189.93-km Amaravati Outer Ring Road (ORR) will have 17 interchanges along its six-lane,…
Rashmika Mandanna is taking her role as M.S. Subbulakshmi quite seriously. The actress described the…