
“కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయం మేమే. కాంగ్రెస్, బిజేపిలతో పోరాడగలిగేది మేమే. ఆ పార్టీలను అడ్డుకోగలిగేది… విజయం సాధించేది మేమే…” బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పే ఈ చిలక పలుకు విని చప్పట్లు కొట్టే గులాబీ బ్యాచ్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.
శాసనసభ ఎన్నికల మొదలు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీ వాటితో పోరాడుతూనే ఉన్న మాట నిజం. కానీ గెలుపు మాత్రం అబద్దం. ప్రతీ ఎన్నికలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు బీఆర్ఎస్ పార్టీ బయటపడుతోంది.
కానీ కేటీఆర్ మేకపోతు గాంభీర్యం తగ్గలేదు… దురహంకారపు మాటలు తగ్గలేదు. సిఎం రేవంత్ రెడ్డిని ‘హౌలా గాడు’ అని చాలా చులకనగా మాట్లాడే కేటీఆర్, నిన్న చెల్లి సందించిన ప్రశ్నలలో ఎ ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయారు… అనే కంటే చెప్పే సాహసం చేయలేకపోయారనవచ్చు.
రేపు ఆమె రాజకీయ పార్టీ సిద్ధం అయ్యాక ఆమె విమర్శల తీవ్రత ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. పైగా బీఆర్ఎస్ పార్టీని నిలువునా చీల్చే ప్రమాదం పొంచి ఉంది. కేసీఆర్ ఫామ్‌హౌసుకే పరిమితమయ్యారు. కనుక ఈ విషయంలో ఆయనని తప్పు పట్టలేము.
కానీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని నడిపిస్తున్న కేటీఆర్, తనపై, బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే జవాబు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారనిపిస్తుంది.
తనకి రాజకీయాలు చేసే ధైర్యం, నాయకత్వ లక్షణాలు లేవని చెల్లి ఎద్దేవా చేస్తున్నా కేటీఆర్ ఆమెకు సమాధానం చెప్పలేక ఈ విషయంలో తండ్రి సలహా, ఆదేశం కోసం ఫామ్‌హౌసుకి పరిగెత్తారు.
ఇలాంటి కొడుకుని చూసి ఆయన పొంగిపోతారో లేక కూతురుని పిలిచి పార్టీని అప్పగించేస్తారో? బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలహీనపడుతుంటే ఫామ్‌హౌసులో కూర్చొని చేతులు పిసుక్కోవడం లేదా పార్టీని బిజేపిలో విలీనం చేయడం కంటే కూతురు కవిత చేతికి పార్టీ అప్పగించేసి ‘కృష్ణా రామా’ అనుకుంటే మంచిదేమో?
Salman Khan’s Maatrubhumi might arrive in theatres now that the major issues have been resolved.…
Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, actor Suriya…