
2023 ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ లేని బిఆర్ఎస్ తో కేటీఆర్ రాజకీయం చేస్తుంటే, బిఆర్ఎస్ లేని జాగృతితో కవిత ముందుకొచ్చారు. అయితే ఇక్కడ ఇద్దరికి కామన్ పాయింట్ తండ్రి కేసీఆర్. ఈ ఇద్దరు కూడా కేసీఆర్ రాజకీయ వారసులుగా తెలంగాణ రాజకీయాలలోకి అడుగుపెట్టినవారే.
అయితే ఇప్పుడు కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ మాదిరి బిఆర్ఎస్ చాటున తన భవిష్యత్ రాజకీయానికి పునాదులు వేసుకుంటుంటే, కవిత మాత్రం తండ్రిని కాదనుకుని, తండ్రి పార్టీని వద్దనుకుని, అన్న చాటు చెల్లిగా కాకుండా అన్నను తలతన్నే చెల్లిగా, తండ్రికి తగ్గ బిడ్దగా రాణించాలని తన భవిష్యత్ రాజకీయానికి శంకుస్థాపన చేయనుంది.
ఇక్కడ కేసీఆర్ ఆశీస్సులతో పాటుగా కేసీఆర్ పెంచి పోషించిన బిఆర్ఎస్ అనే సంస్థానం కేటీఆర్ కి ఒక రాజకీయ వారసత్వ ఆస్తిగా, హక్కుగా సంక్రమిస్తాయి. అలాగే అవే కేటీఆర్ భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి ఒక కవచం మాదిరి కాపాడతాయి. మరి కవితకు కేసీఆర్ నుంచి అటువంటి వారసత్వ ఆస్తులు కానీ హక్కులు కానీ కవచాలు కానీ శూన్యమనే చెప్పాలి.
ఇక కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకుంటూ, ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ప్రచారం చేసుకుంటూ, ఇప్పటికే కేసీఆర్ వేసిన రాజకీయ పునాదుల మీద తన నాయకత్వాన్ని నిలబెట్టుకోనున్నారు. మరి కవిత జాగృతి పేరుతో రాజకీయం చేస్తూ బిఆర్ఎస్ అధినేత పై ప్రశంసలు చెయ్యలేదు, అలాగే బిఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పై కాకుండా అవినీతి మీద మాత్రమే కవిత ప్రచారాలు సాగాలి.
అటువంటి సందర్భంలో కవిత కూడా బిఆర్ఎస్ అవినీతి మరకల నుంచి అంత సులువుగా తప్పించుకోలేరు. దానికి తోడు కవిత లిక్కర్ కేసు ఆమె ప్రత్యర్థులకు ఒక రాజకీయ ఆయుధంగా మారుతుంది. కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టినా, పెట్టకున్నా కవిత రాజకీయం కుడితిలో పడ్డ ఎలక మాదిరి గిలగిలలాడాల్సిందే.
ఇలా కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకుంటూ తండ్రి చాటు బిడ్డగా బిఆర్ఎస్ బాధ్యతలు చేపట్టడానికి, తెలంగాణ రాజకీయాలలో చక్రం తిప్పడానికి ఉత్సాహపడుతుంటే, కవిత మాత్రం కేసీఆర్ పేరెత్తకుండా, కేసీఆర్ బిడ్డగా తెలంగాణ రాజకీయాలను శాసించాలని ఆశపడుతున్నారు. అయితే వీరిద్దరిలో ఎవరు ఎవరి పైన రాజకీయ ఆధిపత్యం సాధించినా అది కేసీఆర్ ఓటమే అవుతుంది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…