ఒక క్రియేటివ్ వ్యక్తికి ఎప్పుడూ కూడా ఇగో అనేది ఉంటుంది. అయితే అది క్రియేటివ్ ప్రాసెస్ లో భాగంగా సినిమాకు ఉపయోగపడేలా ఉండాలి కానీ దర్శకుడి ఇగో సినిమాపై నెగటివ్ ప్రభావం చూపకూడదు. సినిమా బాగు కోసం ఒక్కోసారి తమ ఇగోలను దర్శకులు పక్కనపెట్టాలి కూడా.
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే లేటెస్ట్ గా విడుదలైన ఖుషి సినిమానే తీసుకుంటే… ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చింది. మొదటి రోజు కలెక్షన్స్ కూడా ప్రామిసింగ్ గానే వచ్చాయి. ఇక వీకెండ్ రెండు రోజుల్లో కలెక్షన్స్ కూడా స్టడీ గా ఉండే అవకాశముంది.
ఇక ఖుషి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్నది పక్కనపెడితే ఖుషి ఇంకా బెటర్ టాక్ తెచుకోగల సినిమానే. కానీ ఒక స్థాయి వరకూ వచ్చి ఆగిపోవడానికి ప్రధాన కారణం దర్శకుడి ఇగో. ఖుషి రన్ టైమ్ 2 గంటల 40 నిమిషాలకు పైమాటే. ఈరోజుల్లో ఈ రన్ టైమ్ తో సినిమా రిలీజ్ చేయడం అంటే సాహసమనే చెప్పాలి.
మూడు గంటల నిడివున్న చిత్రాలు కూడా హిట్ అయిన దాఖలాలు ఉన్నాయి. కానీ దానికి ఒక లెక్క ఉంటుంది. ఎవరి సినిమా వారికి ప్రేమ ఉంటుంది. సీన్లు కట్ చేయాలి అంటే మనసొప్పకపోవచ్చు కానీ కొంచెం కఠినంగా ఉంటేనే బెటర్ అవుట్ ఫుట్ బయటకు వచ్చేది.
ఖుషికు సంబంధించినంత వరకూ అందరి వాదననూ పక్కనపెట్టి తనకు కావాల్సిన సీన్లను శివ నిర్వాణ ఉంచుకున్నాడని టాక్. ఇది ఫైనల్ గా సినిమాపై ఎఫెక్ట్ చూపించింది. కనీసం ఒక పదిహేను నిముషాలు ట్రిమ్ చేసి ఉండుంటే కచ్చితంగా దీనికంటే బెటర్ టాక్ వచ్చి ఉండేది. సినిమా చూశాకా అదేం పెద్ద కష్టం కాదు అనిపించకమానదు.
సహజంగా ఒక సినిమా పోయినప్పుడు ఇటువంటి లోటు పాట్లు గురించి అంతా మాట్లాడతారు. కాకపోతే ఖుషి లా డీసెంట్ టాక్, రివ్యూస్ తో స్టార్ట్ అయినప్పుడు మాట్లాడారు. హైదరాబాద్, ఓవర్సీస్ ఆడుతుంది అనేది చూసుకుని పోయింది పట్టించుకోరు. ఇక్కడ నుండి సినిమా ఎటు వెళ్లినా డైరెక్టర్ మాత్రం ఈ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి.
ఇదే సమస్య నాని సినిమా అంటే సుందరానికి విషయంలో వచ్చింది. నిడివి తగ్గించి ఉంటే సినిమా ఫేట్ మారిపోయేది అప్పుడు కూడా డైరెక్టర్ ఒప్పుకోలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ వే.
సినిమా నిడివి విషయంలో ఇగోలకు పోకుండా జాగ్రత్త పడితే అది సినిమాకు ఎంతో ప్లస్ అవుతుంది.



