టాక్సీవాలా – ఫన్నీ దేవరకొండ మార్క్ సాంగ్!

Ladies And Gentlemen Video Song- Taxiwaalaమరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “టాక్సీవాలా” సినిమా ప్రమోషన్స్ దూసుకెళ్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఒక్కసారిగా హైలైట్ అయిన ఈ ప్రమోషన్స్ లో తాజాగా ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ అనే వీడియో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు. విజయ్ దేవరకొండ మార్క్ ఫన్నీ సన్నివేశాలతో ఆకట్టుకునే విధంగా ఉంది ఈ ప్రోమో.

[m9ad]

ADVERTISEMENT

పిజ్జా డెలివరీ బాయ్, సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ… కారు కోసం వెతికే విజయ్ దేవరకొండ సీన్స్ ఫ్యాన్స్ ను మెప్పించే విధంగా ఉన్నాయి. అసలు ఎలాంటి అంచనాలు లేనటువంటి ఈ సినిమాపై నెమ్మదిగా ప్రేక్షకులలో నమ్మకం కలిగించే విధంగా ప్రమోషన్స్ ఉండడం ఆహ్వానించదగ్గ పరిణామం. రాహుల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువీ క్రియేషన్స్ అండ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories