ఫ్లో-లో “కేటీర్” ప్రైవేట్ ఫోన్ నంబర్ బయటపెట్టేసాడు!

Lagadapati Rajagopal Reveals Two Winning Candidates in Telangana Electionsఒక పక్క కేటీఆర్…మరో పక్క లగడపాటి మధ్య వ్యాట్స్ అప్ వార్ తారా స్థాయికి చేరింది. నిన్న లగడపాటి చెప్పిన ఇన్‌డిపెండెంట్స్ వివరాలను ఆధారంగా చేసుకుని కేటీఆర్ ఈరోజు ఉదయాన్నే లగడపాటితో తాను చేసిన వ్యాట్స్ అప్ చాట్ ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పెట్టడం, ఆ క్రమంలోనే నవెంబర్ లో తాము గెలుస్తామ ని చెప్పిన లగడపాటి మళ్లీ ఏవేవో మాట్లాడుతున్నారు అని, ఆయన్ని విమర్శించిన క్రమంలో దానికి కౌంటర్ గా అసలు ఏం జరిగిందే చెప్పడానికి డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చేశారు లగడపాటి.

[m9ad]

ADVERTISEMENT

అయితే కేటీఆర్ బయటపెట్టిన ఆ సర్వే స్క్రీన్ షాట్ కి ముందు వెనుక ఏం జరిగిందే క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేసిన లగడపాటి అనుకోకుండా, కేటీఆర్ ప్రైవేట్ నంబర్ ని బయట పెట్టేశాడు. ఇక లైవ్ కావడంతో ఆ నంబర్ అందరికీ తెలిపోయింది. అయితే దీనిపై సోషియల్ మీడియాలో రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కొందరు లగడపాటి గురించి ఆయన కంగారులో కేటీఆర్ ప్రైవేట్ నంబర్ బయట పెట్టడం గురించి ఆయనపై విమర్శలు చేస్తుంటే, మరో కొందరు లగడపాటి నంబర్ ఇదే అని…పొరపాటున కూడా ట్రై చెయ్యకండి స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని శెటైర్స్ వేస్తున్నారు. ఇంకొందరు అయితే ఏకంగా…కేటీఆర్ అన్నా….నువ్వు నేను ఈరోజు నుంచి వ్యాట్స్ అప్ ఫ్రెండ్స్ అంటూ జోక్స్ వేస్తున్నారు.

అయితే అసలు అక్కడ జరిగిన మ్యాటర్ క్లుప్తంగా చూస్తే, కేటీఆర్ అడగడం వల్లనే లగడపాటి సర్వే చేయించాడు అని, పైగా కేసీఆర్ విధానం వల్ల ఇబ్బందులు ఉన్నాయి అని కేటీఆర్ చెప్పడం, తాను అమెరికా వెళ్లిపోతాను అని అనడం, అదే క్రమంలో లగడపాటి ఎన్నికల విషయమై గుడ్ లక్ చెప్పడం ఇలా వారి మధ్య మంచి స్నేహ పరమైన చాటింగ్ నడిచింది అని అనుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే మాత్రం లగడపాటి కేటీఆర్ ట్వీట్ కి తన ప్రెస్ మీట్ తో భారీ షాక్ ఇచ్చాడు అని స్పష్టం అవుతుంది.

Lagadapati Rajagopal - KTR - WhatsApp Conversation

Lagadapati Rajagopal - KTR - WhatsApp Conversation

Lagadapati Rajagopal - KTR - WhatsApp Conversation

Lagadapati Rajagopal - KTR - WhatsApp Conversation

ADVERTISEMENT
Latest Stories