మే మూడైన ఏడైనా… బయటపడే మార్గం ఏది?

Lockdown Relaxation is not good ideaకేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం… దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 17,264‬ కు చేరింది. కేసుల ఉధృతి కొంచెం తగ్గింది అనుకుంటుండగా… ఆదివారం ఒక్కరోజే భారీగా కేసులు నమోదు అయ్యి ఆందోళనకు గురిచేస్తుంది. గత నెల 24 నుండి దేశం సంపూర్ణ లాక్డౌన్ లో ఉంది. ఈరోజు నుండి కొంత మేర మినహాయింపులు ఇచ్చినా, చాలా వరకు లాక్డౌన్ కిందే ఉందని చెప్పుకోవాలి.

కొన్ని రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన మినహాయింపులు కాదని, సంపూర్ణ లాక్డౌన్ నిర్వహిస్తున్నాయి. ఇక తెలంగాణ ఐతే కేంద్రం విధించిన లాక్డౌన్ మే 3 వరకే కాగా మే 7వరకూ లాక్డౌన్ ని పొడిగించింది. అయితే మే 3 అయినా, మే 7కైనా ఈ పరిస్థితి చక్కబడుతుందా అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి… మే మొదటివారంలో పరిస్థితిని సమీక్షించుకుని లాక్డౌన్ ని పొడిగించవచ్చు కూడా.

ADVERTISEMENT

ఈ తరుణంలో భవిష్యత్తు ఏంటి అనేది తెలియకుండా ఉంది. అలాగని ప్రభుత్వాలను కూడా నిందించలేని పరిస్థితి. అయితే ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభువులు ఎటువంటి కష్టం వచ్చినా తమను ఆదుకోవాలని భావిస్తూ ఉంటారు. దీనితో అధికారంలో ఉన్న వారికి ఇది గడ్డు కాలం అనే చెప్పుకోవాలి.

ప్రభుత్వాలు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ప్రజలలో తిరుగుబాటు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రోజుకు అది కొంత అతిశయోక్తిగా అనిపించినా ప్రభుత్వాలు అందుకు కూడా సిద్ధపడాలి. అంతకంటే ముందుకు కరోనా రక్కసిని తరిమి వేసే మందు లేదా టీకా కోసం దేవుడిని ప్రార్ధించాలి.

ADVERTISEMENT
Latest Stories