అమరావతి నిధులకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ చేయూత!

Chandrababu London photoపెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లండన్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. చంద్రబాబు బృందంతో సమావేశమైన లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సంస్థ సీఈఓ నిఖిల్ రాఠీ, స్టాక్ ఎక్స్చేంజ్ గురించి పూర్తి వివరాలు వెల్లడించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మౌలిక సదుపాయాల కల్పనపై సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరిపారు.

అమరావతిలో భాగస్వామ్య అవకాశాలపై, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయంపై ఏపీ ప్రభుత్వం తరపున చంద్రబాబు పలు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా అమరావతికి నిధుల సమీకరణలో సాయం అందించేందుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ఏపీలో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా సంప్రదింపులు చేయనున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories