రసిక శిఖామణులున్నారు… జర భద్రం తల్లీ!

వైసీపిలో ఉన్నప్పుడు వాసిరెడ్డి పద్మకి మహిళా కమీషన్‌ ఛైర్మన్‌ పదవి లభించినప్పుడు రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసినవారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ బాధిత మహిళల గురించి ప్రభుత్వాన్ని విమర్శించినందుకు, పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లకు నోటీసులు పంపారు.

తమ అధినేత జగన్మోహన్‌ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు ఆమె వారికి నోటీసులు ఇచ్చారని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జగన్‌ హయాంలో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. అంటే అప్పుడు ఉండేదని అబద్దం చెప్పారా లేదని ఇప్పుడు నిజం చెపుతున్నారా? ఆమే చెప్పాలి.

ADVERTISEMENT

ఆమె జగన్‌ అనుచిత, నిరంకుశ వైఖరి గురించి తన రాజీనామాలేఖలోనే పూస గుచ్చిన్నట్లు వివరించారు. గత 5 ఏళ్ళుగా టిడిపి, జనసేనలు జగన్‌ గురించి అదే చెప్పేవి. చివరికి పార్టీ వీడిన తర్వాత ఆమె కూడా వాటినే ధృవీకరించారు.

జగన్‌పై నమ్మకం కోల్పోయి బయటకు వెళ్ళిన వైఎస్ షర్మిలతో సహా ప్రతీ ఒక్కరూ జగన్‌ తీరుని తప్పు పడుతూనే ఉన్నారు. కానీ అవేవి పట్టించుకోకుండా ఆ స్థానంలోకి ప్రవేశించిన మరొకరు, జగన్‌ కోణంలో నుంచి మాట్లాడుతుంటారు. ప్రభుత్వాన్ని, సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుంటారు. రాజకీయాలలో ఇది సహజమే. ఆవిదంగా వచ్చి వైసీపి అధికార ప్రతినిధిగా చేరినవారే యాంకర్ శ్యామల.

ఆమె మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు భద్రతలేకుండా పోయిందని, అయినా సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ నిమ్మకు నీరెత్తిన్నట్లు చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీస్ శాఖ ఏం చేస్తున్నాయి?” అంటూ ఆమె ఇంకా చాలా విమర్శలు, ఆరోపణలే చేశారు. వాటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ తప్పకుండా జవాబు చెప్పాల్సిందే. ఇటువంటి హేయమైన నేరాలు జరుగకుండా అన్ని చర్యలు తీసుకోవలసిందే.

అయితే గంట, అరగంట, దువ్వాడ వంటి రసిక శిఖామణులున్న పార్టీలో ఉంటూ ఆమె ఇతరులను వేలెత్తి చూపుతుండటం ఆశ్చర్యంగానే ఉంది. మహిళల గురించి మాట్లాడాలనుకుంటే ఆమె ముందుగా వైసీపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ భార్య వానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడి ఉండాలి.

నిన్నటి వరకు వైసీపిలోనే ఉన్న వాసిరెడ్డి పద్మతో మాట్లాడి ఉంటే పూర్తి క్లారిటీ వచ్చి ఉండేది. కానీ క్లారిటీ లేకుండా కొనసాగితే భవిష్యత్‌లో ఏదో ఓ రోజు ఆమె కూడా వైసీపి నుంచి బయటకు వచ్చి ‘లోపల అంతా చాలా డర్టీ… డర్టీగా ఉందని’ వాసిరెడ్డి పద్మలాగే చెప్పాల్సి రావచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Netflix Under Fire: Why Pay for YouTube-Level Content?

Kamiya Jani has been a popular face on social media for her way of interacting…

17 minutes ago

Mass H-1B Layoffs at Fortinet?

A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…

3 hours ago