2023 కొందరికి భారంగా…మరికొందరికి గోరంగా…ఇంకొందరికి ఆహ్లాదంగా గడిచిపోయి ఉంటుంది. ఏదేమైనా గతాన్ని మార్చలేము, భవిష్యత్తు ని ఊహించలేము, వర్తమానాన్ని కాదనలేము.అలా గతం మిగిల్చిన జ్ఞాపకాలను తల్చుకుంటూ భవిష్యత్ మీద ఆశతో ప్రస్తుతాన్ని నెట్టుకెళ్లాల్సిందే.
ఈ కాలచక్రానికి కోట్లు గడించిన కోటేశ్వరుడైనా, రాజకీయాలలో తల పండిన నేతలైన, సెలబ్రెటీ హోదాలు అనుభవిస్తున్న వెండి తెర హీరోలైనా, పొట్ట చేత పట్టుకున్న సామాన్యుడైనా అందరు ఒక్కటే అనేది వాస్తవం.తెలుగు ప్రేక్షకులందరికీ ఎందరో రాజకీయ ప్రముఖులు,సినీ సెలబ్రెటీలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు.
అలాగే m9 పాఠకులతో పాటుగా,రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ “మిర్చి 9 ” తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్ని రంగాలలో ఆశించిన ఫలితాలను అందుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రజలను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్లాలని 2023 కి వీడ్కోలు పలుకుతూ 2024 కి సాదర స్వాగతం పలుకుతున్నాం.




