ట్రైలర్ టాక్ – ఈ కధతో మొత్తం ఎన్ని సినిమాలు ఉన్నాయి?

Maa Abbay - Trailer Talk‘ప్రేమ ఇష్క్ కాదల్, జ్యో అచ్యుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాలతో ప్రామిసింగ్ యాక్టర్ గా కనపడిన శ్రీవిష్ణు తాజాగా “మా అబ్బాయి” చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసింది. వట్టి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను చూసిన తర్వాత, ఇలాంటి కధలతో తెలుగులో మొత్తం ఎన్ని సినిమాలు రూపుదిద్దుకుని ఉంటాయి? అన్న ప్రశ్న కలగడం సహజమే.

ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమించడం… ఆ తర్వాత విలన్ తో ఫైటింగ్… చివరికి హీరో ప్రేమను సొంతం చేసుకోవడం… సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమా కధ ఇదే అని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఓ విధమైన యాసతో పలికే శ్రీవిష్ణు డైలాగ్స్, ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ మినహా ట్రైలర్ లో చూడడానికి ఏం లేదు. ఇలాంటి రొటీన్ కమర్షియల్ సినిమాల కన్నా, కొత్త తరహా సినిమాల వైపుకు శ్రీవిష్ణు అడుగులు వేస్తే, నారా రోహిత్ మాదిరి తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకునే అవకాశం దక్కుతుంది.

ADVERTISEMENT

లేదంటే… శతకోటి లింగాలలో ఓ బోడి లింగంలా మారిపోవడం ఖాయం..!

ADVERTISEMENT
Latest Stories