మాడ్ స్క్వేర్ మరో టిల్లు స్క్వేర్.?

mad-sqaure

ఈ మధ్య కాలంలో సీక్వెల్ కథలు అటు నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంటే ఇటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. బాహుబలి చిత్రం నుండి ఈ సీక్వెల్ కథల జోరు ఊపందుకున్న మాట వాస్తవం.

ADVERTISEMENT

అయితే 2023 అక్టోబర్ 6 న విడుదలైన మాడ్ మూవీ చిన్న సినిమాగా వచ్చి పెద్ద స్థాయి విజయాన్ని అందుకుంది. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ వంటి నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది.

ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కాలేజీ, యూత్ ఫుల్ ఫిలిం గా వచ్చిన మాడ్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్ వినోదాత్మక చిత్రంగా మాడ్ మంచి విజయాన్ని అందుకుంది, ఆ ముగ్గురి యువ నటులకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

అయితే ఇప్పుడు దానికి సీక్వెల్ రాబోతున్న మాడ్ స్క్వేర్ చిత్రం మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చ్ 28 న థియేటర్లలోకి రాబోతున్న మాడ్ స్క్వేర్ ట్రైలర్ ను నేడు చిత్ర బృందం విడుదల చేసింది. లడ్డు గాడి పెళ్లి చుట్టూ తిరిగే ఒక కామెడీ జోనర్ మూవీ గా మాడ్ స్క్వేర్ ఉంటుంది అంటూ నిర్మాత నాగవంశీ ఇప్పటికే సినిమా మీద ఒక క్లారిటీ ఇచ్చేసారు.

ఈ సినిమాలో ఎటువంటి కథ ఉండదు, కేవలం రెండు గంటల పాటు థియేటర్ లో సరదాగా నవ్వుకుని, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు అంతే, అంతకు మించి ఎటువంటి అంచనాలు పెట్టొకొవద్దు అంటూ తన సినిమా కోసం థియేట్రీర్లకు వచ్చే ప్రేక్షకులకు ముందే హింట్ ఇచ్చారు నాగ వంశీ. అందుకు తగ్గట్టే నలుగురి స్నేహితుల మధ్య గోవాలో సరదగా జరిగే సన్నివేశాలతో ట్రయిలర్ కట్ విడుదలయ్యింది.

గతంలో నాగ వంశీ నిర్మాతగా సిద్దు జొన్నలగడ్ద హీరోగా వచ్చిన టిల్లు, దాని సీక్వెల్ టిల్లు స్క్వేర్ కూడా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కు కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు అదే జోనర్ లో రాబోతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ కూడా సితార బ్యానర్ కు మరో మంచి విజయాన్ని అందించేలానే కనిపిస్తుంది.

అయితే మాడ్ స్క్వేర్ కు పోటీగా నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ మూవీ కూడా ఈ నెల మార్చ్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ కూడా మంచి వినోదాత్మకంగా ఉంటుందంటూ చిత్ర యూనిట్ తన ప్రమోషన్ కార్యక్రామలలో ఆడియెన్స్ కు బలంగా ప్రచారం చేస్తున్నారు.

అయితే వరుస ప్లాప్స్ లో ఉన్న నితిన్ కు ఈ రాబిన్ హుడ్ విజయం అత్యంత కీలకంగా మారింది. అలాగే మాడ్ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముగ్గురు హీరోలకు కూడా మాడ్ సీక్వెల్ విజయం మంచి బూస్ట్ అప్ లా పని చేస్తుంది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగవంశీ కూడా మాడ్ స్క్వేర్ తో తన ఖాతాలో మరో విజయం ఖాయమనే ధీమా తో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories