మధుప్రియను నా నుండి దూరం చేయడానికే ఇదంతా..!

madhu priya husband srikanth on recent issueప్రేమ పెళ్ళితో మొదలు మొన్నటి పోలీస్ స్టేషన్ వరకు అనేక ట్విస్ట్ లతో కూడిన మధుప్రియ – శ్రీకాంత్ ల ‘ప్రేమకధ’కు ఇటీవల శుభంకార్డు పడిన విషయం తెలిసిందే. అయితే మొత్తం ఈ ఉదంతంలో మధుప్రియ వ్యవహార తీరు చర్చనీయాంశం కావడంతో… విమర్శలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అయితే మధుప్రియ ఎవరినీ మోసం చేయలేదు, ఆమె అలాంటిది కాదు అంటూ భర్త శ్రీకాంత్ తాజాగా వివరణ ఇచ్చుకున్నారు.

సోషల్ మీడియాలో మధుప్రియ హాట్ టాపిక్ కావడంతో ఆమె నడవడికపై ఇటీవల ఓ యువకుడు ఒక వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వ్యాఖ్యలకు తాము ఎంతగానో బాధపడుతున్నామని, తమ గురించి రాసేటపుడు మనోభావాలను కూడా అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన శ్రీకాంత్, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఏ ఒక్క విషయం కూడా నిజం కాదని స్పష్టం చేసారు.

ADVERTISEMENT

తమకు పెళ్ళైన నాటి నుండి ఇప్పటివరకు తామిద్దరిని విడదీయడానికే మధుప్రియ తల్లితండ్రులు చూస్తున్నారని, ఇప్పటికీ కూతురు మనసు మార్చి వారితో తీసుకెళ్ళిపోవడానికి ఫోన్లు చేస్తున్నారని, వారికి తానూ నచ్చకపోవడం వల్లనే ఇదంతా జరుగుతోందని, ప్రస్తుతం తానూ వేగంగానే కోలుకుంటున్నానని శ్రీకాంత్ ఆవేదన చెందుతూ ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసారు.

ADVERTISEMENT
Latest Stories