మాచర్ల నిందితుడు పరారీ?

Maharla YSRCP Leader absconding గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ సీనియర్ నేతలు… బోండా ఉమ, బుద్దా వెంకన్నలు ప్రయత్నిస్తున్న కారును వైఎస్సార్ కాంగ్రెస్ యువత మాచర్ల టౌన్ ప్రెసిడెంట్ తురక కిషోర్ పట్టపగలు ఎటాక్ చెయ్యడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీ ఆఫీసు వద్ద ధర్నా చెయ్యడంతో పోలీసులు కేసులు పెట్టారు.

ADVERTISEMENT

అయితే ప్రభుత్వం మీద ఉన్న భక్తితో పోలీసులు తేలికైన సెక్షన్లతో కేసులు పెట్టి అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలి పెట్టారు. అదేమంటే విచారణ జరిగినన్ని రోజులు స్టేషన్ కు రావాలని చెప్పినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. తాజాగా ప్రధాన నిందితుడు తురక కిషోర్ పరారీలో ఉన్నట్టుగా టీవీ ఛానెల్స్ లో వార్తలు వస్తున్నాయి.

దీనితో అతనిని ఉద్దేశపూర్వకంగానే తప్పించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కిషోర్ 13వ వార్డు నుంచి బరిలోకి దిగారు. మహంకాళి కన్నారావు అనే వ్యక్తి ఆయన తరపున నిన్న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మాచర్లలోని అత్యధిక వార్డులు ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలుచుకుంది.

ఇక్కడ విపక్ష పార్టీలను కనీసం నామినేషన్లు కూడా వెయ్యనివ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు రాష్ట్ర స్థాయి నేతల మీద హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి వైఎస్సార్ కాంగ్రెస్ బీ- ఫారం ఇవ్వడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది. దానికి తోడు పోలీసులు కూడా అతను పరారయ్యేలా సహకరించడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories