మహర్షి వల్ల ఆ హీరోకు ఉపయోగం లేనట్టేనా?

Maharshi success nothing plus to Allari naresh సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25వ సినిమా మహర్షి మొదటి రోజు నెగటివ్ టాక్ తో మొదలైన రెండో రోజు వసూళ్ళు స్థిరంగానే ఉన్నాయి. ఈ వారాంతం వరకూ ఈ జోరు కొనసాగే అవకాశం ఉంది. దీనితో ఈ సినిమా కొన్న వారిలో, అభిమానులలో ఆశలు చిగురించాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో అల్లరి నరేశ్ కనిపించారు. ఒక స్టార్ సినిమా లో అల్లరి నరేష్ నటించడం ఇదే తొలిసారి. ఆయన ఉన్నంతమేర బాగానే చేసినా నరేష్ ఆయన కేరీర్ లో మరుపురానిది అయితే కాదు.

ADVERTISEMENT

గత కొద్ది కాలంగా నరేష్ కేరీర్ ఒడిదుడుకులకు గురి అవుతుంది. ఆయన సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీనితో ఈ సినిమా మీద నరేష్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా ఆయన కేరీర్ కు హెల్ప్ అవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే సినిమాలో మహేష్ తరువాత ఏదైనా బాగా వచ్చిన క్యారెక్టర్ ఉంది అనుకుంటే అది నరేష్ దే. మహర్షి గనుక నెమ్మదిగా హిట్ అయిపోతే నరేష్ కు అవకాశాలు రావొచ్చు.

సినిమా గనుక ప్లాప్ అయితే మాత్రం కష్టమే. మహర్షి మీద దాదాపుగా 100 కోట్ల బిజినెస్ జరిగింది. ఇది రాబట్టడం అంత తేలికైన విషయమైతే కాదు. అయితే వేసవి సెలవులు కావడం, దగ్గర్లో పెద్ద సినిమాలు లేకపోవడం ఈ సినిమాకు కొంత మేర కలిసి వచ్చేదే. అయితే సినిమా జాతకం మీద సోమవారం నాటి వసూళ్ళ బట్టి ఒక అంచనాకు రావొచ్చు. మహర్షి తరువాత మహేష్ బాబు ఎఫ్2 వంటి భారీ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడితో తన తదుపరి చిత్రం చెయ్యబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories