బాలీవుడ్ లో కూడా కనకవర్షం కురిపించిన “బాహుబలి” సినిమా, తమిళ సినీ ప్రియులకు కూడా విశేషంగా అలరించిన విషయం తెలిసిందే. సాధారణంగా తమిళంలో ఇతర భాషా చిత్రాలకు పెద్దగా ఆదరణ లభించదు. కానీ, ‘బాహుబలి’ విషయంలో మాత్రం డైరెక్ట్ తమిళ సినిమాలకు ఇచ్చే రెవిన్యూతో ఆశీర్వదించారు. దీంతో ‘బాహుబలి 2’ అంతకు మించిన స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ భావనతోనే ఈ సినిమాకు సంబంధించిన తమిళ హక్కులు ఎప్పుడో అమ్ముడైపోయాయి.
మరి ‘బాహుబలి 2’ తర్వాత ఆ స్థాయి డిమాండ్ ఏ తెలుగు సినిమాకు ఉంది? అంటే మురుగదాస్ – మహేష్ ల కలయికలో తెరకెక్కుతోన్న సినిమాకే అని చెప్పాలి. తమిళనాట మహేష్ కు కొంత మార్కెట్ ఉన్న మాట వాస్తవమే గానీ, అక్కడ స్టార్ హీరోలతో పోటీపడే మార్కెట్ అయితే ఏ తెలుగు హీరోకు లేదనే చెప్పాలి. కానీ, ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండడంతో, తమిళనాట ఈ సినిమా పట్ల ఓ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ట్రేడ్ వర్గాల లేటెస్ట్ టాక్ ప్రకారం… మార్కెట్ పరంగా ‘బాహుబలి 2’ తర్వాత స్థానం ఈ సినిమాకే దక్కుతుందని భావిస్తున్నారు.



