మహేష్ 27పై ఇంటరెస్టింగ్ న్యూస్!

She Went Back on Controversy Note @Mahesh Babuప్రిన్స్ మహేష్ బాబు తన 25వ సినిమాగా ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “మహర్షి” సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా తర్వాత, సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోయే సినిమాలో ప్రిన్స్ కనిపించబోతున్నారు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఆ తర్వాత సినిమాపై ఇప్పటివరకు అనేక రకమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు రాజమౌళి పేర్లు హాట్ హాట్ గా హల్చల్ చేయగా, ఈ టాప్ డైరెక్టర్లను కాదని ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రిన్స్ నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరో విశేషం ఏమిటంటే… ఈ సినిమాకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాత కావడం.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ ఓ సినిమా చేయబోతున్నారని, ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన విషయం తెలిసిందే. వాటిని నిజం చేస్తూ… తన 27వ సినిమాను అల్లు అరవింద్ కు ప్రిన్స్ ఇచ్చినట్లుగా టాలీవుడ్ టాక్. మెగా హీరోలతో తప్ప, వేరే స్టార్ హీరోలతో బడా సినిమాలు చేయని గీతా ఆర్ట్స్ లో ప్రిన్స్ అడుగుపెట్టడం ఖాయమే అయితే, మరో సంచలనానికి తెరలేపినట్లే!

ADVERTISEMENT
Latest Stories