కానీ కానీ కానీ… ఈ ఉగాది కూడా కానీయ్..!

Mahesh Babu - A R Murugadoss Movie First look Teaserప్రతి పండగ లేదా ఏదైనా స్పెషల్ డే రావడం… ఫస్ట్ లుక్ వస్తుందని అభిమానులు ఎదురు చూడడం… మళ్ళీ పండగ సమయం వరకు వేచి చూడడం… మళ్ళీ సేం సీన్ రిపీట్ కావడం…! గతేడాది దసరా నుండి ప్రస్తుత ఉగాది వరకు ఇదే తంతు! ప్రతి పండగ సమయానికి ఇదిగో ఫస్ట్ లుక్ వచ్చేస్తుందని ప్రిన్స్ ఫ్యాన్స్ హడావుడి చేస్తుండగా, అది గాక రాకపోవడంతో నిరుత్సాహపడడం తర్వాత ప్రక్రియగా మారింది.

నిజానికి ఇందులో చిత్ర యూనిట్ ను నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఒక్క సమాచారాన్ని కూడా అధికారికంగా తెలియజేయలేదు. ఒక్క రిలీజ్ డేట్ మినహా, ఇప్పటివరకు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, ఆడియో వంటి వివరాలు ఏవీ కూడా చిత్ర యూనిట్ సభ్యుల నుండి వెలువడలేదు. అయితే ఏ స్పష్టత ఇవ్వకపోవడంతో, అభిమానులు ప్రతి పర్వదినం నాడు తమ హీరో పలకరిస్తాడేమోనని వేచిచూడాల్సి వస్తోంది.

ADVERTISEMENT

ప్రస్తుతం వియత్నాంలో జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది. అదే తేదీన చిత్ర యూనిట్ చెన్నై చేరుకోనుంది. ఆ తర్వాత ‘ఫస్ట్ లుక్’ను విడుదల చేసే సన్నాహాల్లో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా ప్రముఖ పీఆర్ఓ బిఎ రాజు స్పష్టం చేసారు. దీంతో తెలుగు ఉగాదికి కాకుండా, తమిళ ఉగాది ప్రిన్స్ ఫస్ట్ లుక్ దర్శనం ఇవ్వవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.

ADVERTISEMENT
Latest Stories