
అయితే వీటన్నింటికి దర్శకుడు మురుగదాస్ త్వరలోనే శుభంకార్డు వేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను స్వయంగా మురుగదాస్ ప్రకటన చేయనున్నారని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్ విశేషాల నుండి ఆడియో, సినిమా రిలీజ్ డేట్ ల వరకు అన్నింటిపై ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారట. అయితే, ఇంతవరకు వేచిచూసిన ప్రిన్స్ అభిమానులకు పండగ కలిగించే విధంగా టీజర్ మరియు సినిమా ఉంటుందన్న టాక్ కూడా కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.
తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం అవుతోన్న ఈ సినిమాను, హిందీ భాషలోకి కూడా అనువాదం చేయబోతున్నారనేది లేటెస్ట్ గా సందడి చేస్తోన్న సమాచారం. బహుశా దీనిపై కూడా మురుగదాస్ స్పష్టత ఇస్తారేమో చూడాలి. ‘బాహుబలి’ తర్వాత హిందీలో విడుదలైన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ అబాసుపాలు కావడంతో, హిందీలోకి ఈ సినిమాను అనువదిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
The Tamil Nadu Legislative Assembly witnessed a high-voltage moment today as the Leader of the…
Actor Rahul Ramakrishna has sparked a fresh debate on social media by calling out the…