సామాజిక బాధ్యత కలిగిన సినిమాలతో… సామాజిక స్పృహతో చేస్తోన్న విధి నిర్వహణతో… అశేషమైన అభిమానగణాన్ని తన సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘x’ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ… మీ ప్రయాణం చాలామందికి ప్రేరణగా నిలవాలని, చాలామందిని వృద్ధిలోకి తీసుకువచ్చేలా ఉండాలని ఆకాంక్షిస్తూ… ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని అన్నారు.
నిజానికి పవన్ కళ్యాణ్ పుట్టినరోజుపై ట్వీట్ వేయడం మహేష్ బాబుకు ఇది తొలిసారి కాదు గానీ, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తొలి పుట్టినరోజు కావడంతో దీనికి ప్రాధాన్యత దక్కింది.
అందరి హీరోల పుట్టినరోజులకు, విశిష్టమైన రోజులకు శుభాకాంక్షలు తెలపడం సూపర్ స్టార్ ఎప్పుడూ చేసేదే! అలాగే చిన్న, పెద్ద అన్న సినిమాల తారతమ్యం లేకుండా మంచి సినిమాలను చూసి వాటికి ‘రివ్యూ’లను అందించడం మహేష్ కు పరిపాటి.
ఈ విషయంలోనే ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మారుతీ సుబ్రహ్మణ్యం’ సినిమా పైన కూడా ట్వీట్ వేయడంతో చాలా మంది నెటిజన్లు, ఇన్ఫ్లుయెన్సుర్లు షాక్ తిన్నారు.
అందుకే మా ‘బాబు’ మనసు ‘బంగారం’ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఆ బంగారు మనసుతోనే తన సమకాలీన స్టార్ హీరోల సినిమాలైన ‘జల్సా, బాద్ షా’లకు కూడా ‘వాయిస్ ఓవర్’ అందించారనేది అభిమానుల మాట.




