అత్యంత ఆనందంలో మహేష్!

mahesh babu daughter sitara kuchipudi danceసూపర్ స్టార్ మహేష్ బాబు తనయురాలు సితార పాప గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయిన సితార పాప, ఇటీవల “సర్కార్ వారి పాట” సినిమాలో ‘లెట్ మీ నో యువర్ కేవైసీ’ అంటూ వేసిన స్టెప్పులు అందరిని ఫిదా చేసాయి.

వెస్ట్రన్ పాటలకు డ్యాన్స్ లు వేయడం సితారకేమి కొత్త కాదు. ఇంస్టాగ్రామ్ లలో చాలా పాటలకు కాలు కదిపి, వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటుంది. అయితే మహేష్ సినిమాలో కనిపించడం తొలిసారి కావడంతో, సితార మరింతగా హైలైట్ అయ్యింది.

ADVERTISEMENT

తాజాగా ‘శ్రీరామనవమి’ పండగను పురస్కరించుకుని, సితార మొదటిసారిగా కూచిపూడి నృత్య ప్రదర్శన వీడియోను మహేష్ పోస్ట్ చేసారు. ‘శ్రీరాఘవమ్’ అన్న శ్లోకానికి సితార చేసిన కూచిపూడి నృత్యం వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ వీడియోలో సితార పలికించిన హావభావాలు బాగున్నాయి.

ఈ వీడియోను పోస్ట్ చేస్తూ మహేష్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. తనను ఎప్పుడూ గర్వపడే విధంగా సితార చేస్తూనే ఉంటోందని చెప్పిన సూపర్ స్టార్, సితార కూచిపూడి టీచర్లు అయిన అరుణ భిక్షు మరియు మహతి భిక్షులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇక మే 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోన్న “సర్కార్ వారి పాట” తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇంకా కొంత పార్ట్ షూటింగ్ మిగిలి ఉండగా, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటోంది. అతి త్వరలో మరో పాట రిలీజ్ కు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే నేరుగా రిలీజ్ చేస్తారో? లేక యధావిధిగా ముందుగానే లీక్ అయిపోతుందో వేచిచూడాలి.

ADVERTISEMENT
Latest Stories