రకుల్ ప్రీత్ సింగ్, రానా, అఖిల్ ల సందడితో ఇప్పటికే పాపులర్ అయిన మంచు లక్ష్మి “మేము సైతం” కార్యక్రమం మరో రూపం సంతరించుకోబోతోందా? వర్ధమాన నటులతో పాటు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు కూడా ఇందులో భాగస్వామి కానున్నారా? అంటే అవుననే సమాధానం సినీ వర్గాల నుండి వస్తోంది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ఆర్ధిక సాయం అందించేందుకు రూపొందించిన కార్యక్రమమే ‘మేము సైతం.’ సామాన్యుల మాదిరి సెలబ్రిటీలు ఒక రోజు కష్టపడి వచ్చిన మొత్తాన్ని ‘మేము సైతం’కు తరలించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. మరి సామాన్యుల మాదిరి మన స్టార్లు రోడ్ల మీదకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? వీటిని కూడా అంచనా వేసిన నిర్వాహకులు పూర్తి స్థాయిలో భద్రత సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారట.
సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ వార్తలు నిజమైతే ప్రిన్స్, యంగ్ టైగర్ అభిమానులకు పండుగే! మరి ఈ స్టార్ హీరోలు ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రజల ముందుకొస్తారో వేచిచూడాలి.



