స్పైడర్ – భాషదేముంది… భావం అదిరిందిగా..!

Mahesh to the Funniest at SPYder Sets!Not to Miss!మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న “స్పైడర్” చిత్ర యూనిట్ నుండి అభిమానుల కోసం ఓ నవ్వు పలకరించింది. ‘స్పైడర్’ సెట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ బుగ్గలు నలుపుతూ ప్రిన్స్ ఇచ్చిన స్మైల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఊహించని ఈ చిన్న వీడియోలో మహేష్ ఇచ్చిన స్మైల్ హైలైట్ గా నిలవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే ఇందులో కొన్ని డైలాగ్స్ ఉండగా, అవి మాత్రం స్పష్టంగా వినిపించడం లేదు.

భాష ఏదైనా గానీ, ‘స్పైడర్’ సెట్స్ లో ఏర్పడిన వాతావరణంలో భావం మాత్రం స్పష్టంగా ఉంది. చిత్ర యూనిట్ అంతా ఎంజాయ్ మెంట్ మూడ్ లో ఉందన్న విషయం వీక్షకులకు స్పష్టం. మహేష్ నవ్వును చూసిన అభిమానులు… ‘ఖలేజా’ సినిమాలోని ‘నీ నవ్వు ఓ వరం’ అనే డైలాగ్ తో రిప్లైలు ఇస్తూ చిత్ర యూనిట్ ను అభినందిస్తున్నారు. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ఓ టీజర్ ప్రేక్షకులను పలకరించనుంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories