మహేష్ చేయబోతున్న ఒంటరి పోరాటం

Mahesh Babu is going to fight aloneస్నేహితులను కోల్పోతేనే తల్లడిల్లే సగటు మనుషులం మనం. అలాంటిది కన్నతల్లి, తండ్రి కేవలం నెలల వ్యవధిలో దూరమైతే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆ విషాదాన్ని భరించాలంటే చాలా పరిణితి కావాలి. అందులోనూ తనకు జన్మనే కాక జీవితాన్ని ఇచ్చి సూపర్ స్టార్ అనే బాధ్యతతో పాటు ఇంతటి అశేషమైన అభిమాన గణాన్ని కానుకగా ఇచ్చిన కృష్ణగారు వెళ్ళిపోతే, తన పని తాను చేసుకుంటూ సున్నితంగా కనిపించే మహేష్ బాబు మానసిక స్థితి ఎంతటి ఒత్తిడిలో ఉందో ఊహించుకోవడమూ కష్టమే. ఉబికి వస్తున్న ఉద్వేగాన్ని ఆపుకుంటూ కన్నీళ్లు బద్దలైతే కుటుంబంతో పాటు లక్షలాది ఫ్యాన్స్ మీద ప్రభావముంటుందని తనకు తెలుసు.

ఇప్పుడు మహేష్ మీద చాలా బాధ్యతలున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న సినిమా ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. కారణాల గురించి బయట ప్రచారాల సంగతి ఎలా ఉన్నా ఈ ఇద్దరూ అతడు, ఖలేజాను మరిపించేలా గొప్ప బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ముందు నుంచి కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే మహేష్ తొందపడకుండా స్క్రిప్ట్ విషయంలో ఎంత ఆలస్యమవుతున్నా సరే ఓపిగ్గా భరిస్తూ వచ్చాడు. సోషల్ మీడియా ఊహాగానాలు ప్రచారాలను బట్టి తన లాంటి హీరోలు ప్రభావితం చెందరు. ఈలోగా వరసగా తనవాళ్ళను కోల్పోవడంతో మరింత జాప్యానికి దారి తీయొచ్చనే అనుమానం లేకపోలేదు.

ADVERTISEMENT

కానీ మహేష్ ఆలోచనా ధోరణి అలా ఎన్నటికీ ఉండదు. తన మీద కోట్లాది అభిమానుల ఆశలు, పెట్టుబడిదారుల నమ్మకాలు ఉన్నాయని తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాతకు ఇబ్బంది లేదా నష్టం కలిగించకూడదనేది తండ్రి నేర్పించిన పాఠమే. దాని కోసం ఎంత రిస్క్ అయినా సరే సిద్ధపడటం తన నైజం. టక్కరి దొంగ క్లైమాక్స్ లో మహేష్ కమిట్ మెంట్ గురించి జయంత్ ని అడిగినా, ఒక్కడు షూటింగ్ లో జ్వరం వచ్చినప్పుడు అలాగే కబడ్డీ ఫైట్ లో పాల్గొన్నా, అతిథి కోసం డూప్ లేకుండా రిస్కీ స్టంట్లు చేసినా ఇవన్నీ వారసత్వంగా వచ్చిన లక్షణాలే. అలాంటప్పుడు కావాలని ఆలస్యాన్ని కోరుకునే ప్రసక్తి ఒక్క శాతం కూడా ఉండదు.

త్రివిక్రమ్ స్క్రిప్ట్ విషయంలో ఏది జరిగినా పర్ఫెక్షన్ కోసం మహేష్ తాపత్రయపడుతున్నప్పుడు ఇలాంటివి తప్పవు. అసలే రాబోయే రోజుల్లో రాజమౌళి కోసం త్యాగం చేయాల్సిన సంవత్సరాల విలువైన కాలం కళ్ళముందు కనిపిస్తోంది. సో దాని కన్నా ముందు చేసే సినిమా పట్ల ఆణువణువూ జాగ్రత్తగా ఉండటం తప్పదు. ఏడాదికి మించి గ్యాప్ ని తట్టుకోలేకపోతున్న ఇప్పటి తరం ఫ్యాన్స్ ని సంతృప్తిపరచాలంటే మళ్ళీ వింటేజ్ మహేష్ మాస్ ని బయటికి తీయాలి. ఆ ప్రయత్నంలోనే త్రివిక్రమ్ ఉన్నాడు. అలాంటప్పుడు అంచనాలతో డిమాండ్లతో ఒత్తిడి పెంచకూడదు.అభిమానులు కుటుంబం పట్ల జవాబుదారిని కృష్ణతో పంచుకున్న మహేష్ ఇప్పుడు దాన్ని ఒంటరిగా మోయాలి. అది బరువు కాదు గురుతర బాధ్యత. దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడమే సంకల్పం.

ADVERTISEMENT
Latest Stories