‘ప్రిన్స్ ఫ్యాన్స్’ సందడి చేస్తున్న వేళ ‘గుడ్ న్యూస్!’

Mahesh babu krishna Vamsiప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఫేస్ బుక్, ట్విట్టర్ లలో “మురారి” జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సందడి చేస్తున్నారు. నటుడిగా మహేష్ ప్రతిభను వెండితెర రూపం దాల్చిన సినిమాగా “మురారి” ప్రిన్స్ కెరీర్ కు ప్రత్యేకమైనది. ఈ సినిమాలో ప్రిన్స్ అభినయానికి స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వరించింది. మహేష్ కెరీర్ లో తొలి సిల్వర్ జుబ్లీ జరుపుకున్న సినిమాగా కూడా “మురారి” రికార్డులకెక్కింది.

ఇటీవల ఈ సినిమా విశేషాలను గుర్తూ చేస్తూ ఓ వారాంతం పుస్తకంలో ప్రచురించిన విశేషాలను ప్రస్తుతం ప్రిన్స్ అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. దర్శకుడు కృష్ణవంశీ రెండు కధలు చెప్పగా, నిర్మాత, ప్రిన్స్ తో సహా అందరూ మరో సినిమా వైపుకు మొగ్గు చూపగా, కృష్ణవంశీ మాత్రం మీరు ఎంచుకున్న కధ అయితే కమర్షియల్ గా బాగా ఆడుతుంది, అదే ‘మురారి’ కధ అయితే ఓ నాలుగు తరాలు చెప్పుకునే సినిమాగా నిలబడుతుందని చెప్పడంతో… “మురారి” ప్రస్థానం ప్రారంభమైంది.

ADVERTISEMENT

అలా కధను నమ్మి చేసిన “మురారి” నిజంగానే కృష్ణవంశీ చెప్పిన విధంగా నిలబడింది. ఈ సినిమా విడుదలై 15 సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే, సినీ ప్రేక్షకులలో ‘మురారి’ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కృష్ణవంశీ ఆలోచనలకు ప్రిన్స్ ప్రాణం పోయగా, మణిశర్మ సంగీతం ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. ఇలాంటి అనుభూతులను పంచుకుంటూ ప్రిన్స్ ఫ్యాన్స్ సందడి చేస్తున్న వేళ, మరో తీపి కబురు అందింది.

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా ప్రిన్స్ ఫైనల్ చేసారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం మహేష్ గెటప్ పూర్తి స్థాయిలో మార్చబోతున్నారని, మునుపెన్నడూ లేని రీతిలో కనపడడానికి ఓకే చెప్పారని సమాచారం. మహేష్ మరింత కొత్తగా కనిపిస్తారంటే ఫ్యాన్స్ కు అంతకు మించిన గుడ్ న్యూస్ ఏముంటుంది!

ADVERTISEMENT
Latest Stories