అసలు విషయం తెలుసుకుని అవాక్కైన ప్రిన్స్ ఫ్యాన్స్!

Mahesh Babu leaked photos with clean shaveగడిచిన కొన్ని గంటలుగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గడ్డం, మీసాలు తీసేసి హాలీవుడ్ హీరో మాదిరి కళ్ళజోడుతో స్టైలిష్ గా కనపడుతోన్న ప్రిన్స్ లుక్, కొత్త సినిమా “మహర్షి”లో మరో లుక్ గా అభిమానులు భావించారు. కానీ అది సినిమాకు సంబంధించిన లుక్ కాకపోవడంతో నిరుత్సాహం వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT

[m9ad]

“మహర్షి” సినిమాలో మహేష్ రెండు విభిన్నమైన లుక్స్ లో దర్శనమిస్తారన్న టాక్ తో, ఈ ఫోటోలు బయటకు రాగానే గడ్డంతో ఓ లుక్, క్లీన్ షేవ్ తో మరో లుక్ లో కనిపిస్తారన్న ఉత్సాహంలో ప్రిన్స్ అభిమానులు ఉన్నారు. కానీ అసలు విషయం తెలుసుకుని ఆ తర్వాత అవాక్కయ్యారు. ప్రస్తుతం జర్మనీలో ఫ్యామిలీ ట్రిప్ వేస్తోన్న సందర్భంలో భాగంగా ఈ ఫోటోలు బయటకువచ్చాయి.

అయితే మరికొద్ది రోజుల్లోనే “మహర్షి” తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానున్న నేపధ్యంలో… ఇదే లుక్ షూటింగ్ లోనూ కొనసాగే అవకాశం లేకపోలేదు. సినిమాలో ఉన్నా, లేకున్నా…. ఈ ప్రిన్స్ లుక్ అండ్ స్టైల్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. గత కొంతకాలంగా అప్ డేట్స్ కు దూరంగా ఉన్న “మహర్షి,” ఈ దసరాకు మరో అప్ డేట్ ను రిలీజ్ చేస్తే ప్రిన్స్ ఫ్యాన్స్ కు మరొకటి పండగ తోడయినట్లే!

ADVERTISEMENT
Latest Stories