మహేష్ బాబు మిస్సింగ్!

Mahesh Babu Missing family photo‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదల తర్వాత యుకే వెళ్ళిన మహేష్, ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. మరో ఒకటి, రెండు రోజుల్లో మళ్ళీ తిరిగి వచ్చి మురుగదాస్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్న మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

యుకే ట్రిప్ లో ఉన్న మహేష్ ఫ్యామిలీ సభ్యులంతా ఉన్న ఫోటోలో ప్రిన్స్ మాత్రం మిస్సయ్యారు. బహుశా ఈ ఫోటోను ప్రిన్స్ తీసారేమో గానీ, నమ్రత, గౌతమ్, సితారలు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. కొత్త సినిమా కోసం కాస్త గడ్డం పెంచబోతున్నాడన్న వార్తలతో మహేష్ ఎలా ఉన్నారు అని ఎదురు చూస్తున్న అభిమాన వర్గానికి ఈ ఫోటో మరింత ఆసక్తిని పెంచింది.

ADVERTISEMENT

బహుశా తన కొత్త లుక్ ఎవరికీ కనిపించకూడదనే భావనతో ఈ ఫోటోలో ప్రిన్స్ కావాలనే మిస్సయ్యారా? అన్న ప్రశ్నలు అభిమానుల్లో ఉత్సుకతను రేపుతున్నాయి. అయితే ఇటీవల యుకేలో లీక్ అయిన కొన్ని ఫోటోలలో లైట్ గడ్డం పెంచుతూ ప్రిన్స్ దర్శనమిచ్చిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories