గత కొన్ని గంటలుగా ప్రిన్స్ అభిమానులను అత్యంత ఆసక్తికరంగా మార్చిన కొత్త సినిమా టైటిల్ పై సందేహాలు వీడిపోయాయి. “రిషి”ని కలుసుకోవడానికి ఈ నెల 9వ తేదీన సిద్ధం కండి అంటూ దర్శకుడు వంశీ పైడిపల్లి స్పష్టం చేసారు. సినిమా టైటిల్ గా దీనిని ప్రకటించలేదు గానీ, రిషి జర్నీ అని తెలపడంతో, ఈ సినిమా కధ ‘రిషి’ అనే వ్యక్తి జీవితంగాఖరారయ్యింది.
బహుశా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో టైటిల్ పై నెలకొన్న సందేహాలు వీడిపోవచ్చు. 9వ తేదీ ప్రవేశించిన రాత్రి 12 గంటలకు ఓ పోస్టర్ మరియు 9వ తేదీ ఉదయం 9 గంటలకు రెండవ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతోంది. ఇప్పటివరకు ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమాపై ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ బజ్ ని క్రియేట్ చేయాలి. ప్రిన్స్ 25వ సినిమా కావడంతో ఫ్యాన్స్ మాత్రం భారీ ఆశలనే పెట్టుకున్నారు.
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



