మహేష్ మేకోవర్ లుక్… ఫ్యాన్స్ హ్యాపీ..!

Mahesh- Babu New lookవంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తోన్న “మహర్షి” సినిమా షూటింగ్ కు బ్రేకునిచ్చి, ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం థాయ్ లాండ్ లోని సాము దీవిలో చక్కర్లు కొడుతున్నాడు ప్రిన్స్. ‘మహర్షి’ సినిమాలో గడ్డం మీసాలతో కనపడి సరికొత్త లుక్ ను ఇచ్చిన ప్రిన్స్, ఈ ట్రిప్ లో మాత్రం మీసాలు, గడ్డం లేకుండా యంగ్ హీరోలా కనపడుతున్నాడు.

ADVERTISEMENT

[m9ad]

బహుశా ఏ ముప్పై ఏళ్ళ యువహీరో అంటే నమ్మేటంతగా కనిపిస్తోన్న ప్రిన్స్ పిక్ ను సతీమణి నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. సాము దీవి నుండి ఇంటికి పయనం అయ్యేటపుడు తీసిన పిక్ గా చెప్పిన నమ్రత, ఎప్పటికప్పుడు ప్రిన్స్ స్టిల్స్ ను అభిమానులకు అందుబాటులో ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తోంది.

ఇక “మహర్షి” షూటింగ్ విషయానికి వస్తే… అక్టోబర్ 15వ తేదీ నుండి యుఎస్ లో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందని, ఆ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే రెండు పాటలు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ADVERTISEMENT
Latest Stories