ఉగాది రోజున కొత్త సినిమా కొబ్బరికయ కొట్టనున్న మహేష్ బాబు

Mahesh Babu next movie launch on ugadhi 2020సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ప్లాన్ చేసిన సినిమా ఇప్పుడు అటకెక్కింది. మహర్షి తరువాత వంశీ ఎటువంటి సినిమా చెయ్యకుండా మహేష్ కోసమే వేచిచూశాడు. ఈ తరుణంలో వంశీ చెప్పిన కథ నచ్చలేదని మహేష్ ఆ ప్రాజెక్టు కాదు అన్నాడు. తాజాగా ఆయన గీత గోవిందం వంటి పెద్ద హిట్ ఇచ్చిన పరశురామ్ తో పని చెయ్యనున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

ఈ ప్రాజెక్టు ఉగాది రోజున ముహూర్తం జరుపుకోనుందట. అయితే మహేష్ బాబు చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర చెయ్యనున్న నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి, జులై నుండి ఈ సినిమా షూట్ మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. ఆ లోగా పరశురామ్ కు బౌండ్ స్క్రిప్ట్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది.

చిరంజీవి సినిమాలో మహేష్ 40 నిముషాల పాత్ర చెయ్యనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ అగ్రెసివ్‌గా కనిపించే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నారట. అంటే మహేష్ మరోసారి మాస్ గెటప్‌లో కనిపించనున్నట్లే. ఈ సినిమా కోసం మహేష్ 25 రోజుల కాల్‌షీట్స్ ఇచ్చారట. రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా పరశురామ్ సహజంగా రొమాంటిక్ సినిమాలు, ఫ్యామిలీ కథలు ఎక్కువగా చేస్తుంటారు. దానితో మహేష్ కు ఆయన ఎటువంటి స్క్రిప్ట్ వినిపించారు అనేదాని మీద మహేష్ బాబు అభిమానులలో చర్చ జరుగుతుంది. పరశురామ్ కు ఇది మంచి అవకాశం. మహేష్ కు ఒక్క హిట్ ఇస్తే ఆయన స్టార్ లీగ్ లోకి వెళ్ళిపోయినట్టే.

ADVERTISEMENT
Latest Stories