‘బ్రహ్మోత్సవం’ విడుదలైన తర్వాత సోషల్ మీడియాకు ప్రధాన వేదికగా మారిన ట్విట్టర్లో పవన్ – మహేష్ అభిమానుల మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ‘బ్రహ్మోత్సవం’ సినిమాను హేళన చేస్తూ పవన్ అభిమానులు చేసిన సందడి ఏకంగా ఓ దినపత్రిక కూడా ప్రచురించడంతో అది మరింత ముదిరి పాకాన పడింది. అయితే కాలక్రమేణా ఆ వివాదం తెరమరుగయ్యింది.
అయితే విడుదలకు ముందు ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ఓ ట్వీట్ లోని స్పెల్లింగ్ మిస్టేక్ ను పట్టుకుని పవన్ ఫ్యాన్స్ చేసిన రచ్చకు తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అలాగే అప్పుడు కూడా పవన్ – మహేష్ అభిమానుల మధ్య ట్వీట్ల వార్ జరిగింది. అయితే తాజాగా ప్రిన్స్ చేసిన ట్వీట్ పట్ల కూడా పవన్ అభిమానులు రచ్చ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో… వారిని ఏకరువు పెడుతూ ప్రిన్స్ ఫ్యాన్స్ కూడా బడులిస్తున్నారు.
‘ఉత్తమ నటుడు’గా సైమా నుండి పురస్కారం అందుకున్నందుకు గానూ కృతజ్ఞతలు చెప్తూ ప్రిన్స్ మహేష్ బాబు ఓ ట్వీట్ చేసారు. అయితే ఆ ట్వీట్లో ‘బెస్ట్ యాక్టర్ ట్రోఫీ’ అని ప్రిన్స్ ప్రస్తావించడం ఈ సారి రచ్చకు కారణమైంది. సాధారణంగా ‘ట్రోఫీ’ అనే పదాన్ని క్రీడా విభాగాలలో వినియోగిస్తుంటారు గనుక, పవన్ అభిమానులు మరోసారి మహేష్ ట్వీట్ ను వేలెత్తి చూపించబోయారు.
అయితే ఆ ‘ట్రోఫీ’ అన్న పదం అవార్డుల విభాగంలోనూ ప్రస్తావిస్తారని ‘ఆస్కార్ ట్రోఫీ’లను ప్రస్తావిస్తూ మహేష్ ఫ్యాన్స్ ధీటుగా బదులివ్వడంతో మరోసారి పవన్ అభిమానులు అత్యుత్సాహం బయట పడినట్లయ్యింది. దీంతో ప్రిన్స్ అభిమానుల సందడి ఎక్కువైంది. రాంగోపాల్ వర్మ చెప్పినట్లు తన అభిమానులకు అక్షరాస్యత పెంచాలని, ముఖ్యంగా ఇంగ్లీష్ నేర్పించే బాధ్యతను పవన్ తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.



