మహేష్ బాబు రిక్వెస్ట్ ని వారు పట్టించుకుంటారా?

Mahesh Babu -fans
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9 న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇప్పటికే అతని అభిమానులు సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. అయితే ప్రతీ ఏడాదిలానే వారు పెద్ద సమావేశాలలో పాల్గొనవచ్చని మరియు అన్ని రకాల పెద్ద వేడుకలు చేయవచ్చని గ్రహించిన మహేష్ బాబు తన అభిమానులకు ఈ సంవత్సరం బహిరంగ సభలను నివారించమని విజ్ఞప్తి చేశారు.

ఈ మహమ్మారి సమయంలో, ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమావేశాలు, సెలెబ్రేషన్లు చేసే పరిస్థితి అయితే అసలు లేదు. దీనితో మహేష్ బాబు ఒక ట్వీట్‌లో, తన అభిమానులు ‘నా పుట్టినరోజున సామాజిక సమావేశాలను నివారించమని’ అడిగారు. “దయచేసి సురక్షితంగా ఉండండి” అని ఆయన కోరారు.

ADVERTISEMENT

ఈ కరోనా సంక్షోభ సమయంలో, మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారారు. ప్లాస్మా విరాళాల కోసం విజ్ఞప్తి చేయడం నుండి వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం వరకు అతను సోషల్ మీడియాలో అవగాహన కలిపించే ప్రయత్నం చేసారు.

ఇది ఇలా ఉండగా.. మహేష్ బాబు ప్రస్తుతం గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు. కరోనా ఉదృతి కొంతమేరైనా తగ్గితే షూటింగ్ ప్రారంభించాలని మహేష్ బాబు భావిస్తున్నారు. అయితే కనుచూపు మేరలో ఆ అవకాశం కనిపించడం లేదు.

ADVERTISEMENT
Latest Stories