సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వచ్చే ఏడాది జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా రోజులుగా సాఫ్ట్ రోల్స్ కు పరిమితం అయిపోయిన మహేష్ బాబులోని మాస్ యాంగిల్ ని వెలికితీసాడు దర్శకుడు. ఆ కోణంలో ఇటీవలే విడుదలైన సినిమా టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇది ఇలా ఉండగా సరిలేరు నీకెవ్వరు రన్ టైమ్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా దాదాపుగా 3 గంటల సినిమాగా రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు రన్ టైమ్ విషయంలో చాలా స్ట్రిక్టుగా ఉంటున్నాడట. రెండున్నర గంటలకు కాస్త అటో ఇటో ఫైనల్ అయ్యేలా చూడామని గట్టిగా చెప్పాడట.
సినిమా రన్ టైం ఎక్కువ అయితే సంక్రాంతికి ఎక్కువ షోస్ వేసుకునే అవకాశం ఉండదు. దీనితో ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఈ సినిమాని ట్రిమ్ చేసి కనీసం 15 నిమిషాలైనా కత్తిరించాల్సిన పరిస్థితి. దిల్ రాజు ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడని సమాచారం. డిసెంబర్ మొదటి వారానికి సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవుతుంది అంటున్నారు.
సినిమాలో మహేష్ బాబు తొలిసారిగా ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారు. అనిల్ ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అనిల్ కృతనిశ్చయంతో ఉన్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన మొట్టమొదటి సారిగా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు.





