మహేష్ బాబు అక్కడ మొదలుపెట్టడం ఏంటి?

Mahesh babu Sarkaru Vaari Paata shooting in USAసూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం సర్కారు వారి పాట షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం దసరా తర్వాత ప్రారంభమవుతుందని అంటున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో జరుగుతుందట. వీసా ఫార్మాలిటీలు ప్రస్తుతం జరుగుతున్నాయి.

ADVERTISEMENT

ఇది ఒక నెల నిడివి గల షెడ్యూల్ అని చెబుతున్నారు. ఇది ఒకరకంగా ఆశ్చర్యకరమైన నిర్ణయం ఎందుకంటే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలలో అమెరికా ఒకటి. దసరా 2021 కోసం సర్కారు వారి పాటను విడుదల చేయాలనేది ప్రణాళిక. వారు షూట్ ప్రారంభించే సమయానికి కనీసం ఒక సంవత్సరం సమయం ఉంటుంది కాబట్టి ఇది సాధ్యమవుతుందనే చెప్పుకోవాలి.

మహేష్ సొంత బ్యానర్‌తో పాటు మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్ ను కంఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి పాటల రికార్డింగ్‌ను ఆయన త్వరలో ప్రారంభిస్తారు. టాప్ సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ ఈ సినిమాకు కెమెరా ను హేండిల్ చెయ్యాల్సి ఉంది.

అయితే ఈ ఆలస్యం కారణంగా అతని డేట్స్ పూర్తిగా వేస్ట్ కావడంతో అతను చిత్రం నుండి బయటకు వెళ్లాడు. అతని స్థానంలో శ్రీమంతుడు కోసం పనిచేసిన మధీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ చిత్రంలోని హీరోయిన్ ని ఇప్పటిదాకా ఖరారు చెయ్యలేదు. అప్పట్లో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ అని వినిపించినా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ADVERTISEMENT
Latest Stories