ప్రిన్స్ ఫ్యాన్స్ ను ‘ఖుషీ’ చేసాడు!

Mahesh-Babuఆదివారం నాడు ముగిసిన ‘బిగ్ బాస్ 2’లో విజేతగా నిలిచిన కౌషల్ ను సహజంగా మీడియా ఛానల్స్ చుట్టుముట్టాయి. ఆ క్రమంలో ఇంటర్వ్యూలు మొదలుపెట్టిన కౌషల్, తన జీవితంలో ఫ్లాష్ బ్యాక్ సంగతులను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కౌషల్ ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణంగా ప్రిన్స్ మహేష్ బాబు పేరును చెప్పడంతో, వాటిని షేర్ చేసుకుంటూ ప్రిన్స్ అభిమానగణం సందడి చేస్తోంది.

“రాజకుమారుడు” సమయంలో మహేష్ బాబు తనను బాగా ప్రోత్సహించారని, అలాగే తనతో ఒక మోడలింగ్ ఏజెన్సీ పెట్టించారని, అప్పటికి అదే హైదరాబాద్ లో ఫస్ట్ అని, మహేష్ బాబే దగ్గరుండి ఓపెన్ చేయించారని చెప్పిన కౌషల్ వ్యాఖ్యలు ప్రిన్స్ అభిమానులను ‘ఖుషీ’లోకి నెట్టాయి. కౌషల్ బయటపెట్టనంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకపోవడంతో, అభిమానగణం హంగామా కారణం ఎక్కువైంది.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories