ఇచ్చిన మాట తప్పిన మహేష్ బాబు!

maheshbabu-not-stands-in-his-wordsమహేష్ మూవీ ‘శ్రీమంతుడు’ సినిమా సిల్వర్‌ జూబ్లీ జరుపుకుంటోంది. 15 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేటికి (జనవరి 28) 175 రోజులు పూర్తి చేసుకుంది. సిల్వర్‌ జూబ్లీ అనే పదం మరిచిపోయిన ఈ రోజుల్లోనూ ఎమ్మిగనూరులోని లక్ష్మణ్‌ థియేటర్‌లో డైరెక్ట్‌ గా అన్నిరోజులు ఆడేసింది శ్రీమంతుడు. ప్రిన్స్ కెరీర్‌లో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌ తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలవడమే కాకుండా 100 కోట్ల షేర్‌ సాధించి రికార్డ్‌ సృష్టించింది. దీంతో సూపర్‌స్టార్ అభిమానులు ఫుల్‌ఖుషీ.

మరో వైపు తమ బ్యానర్‌లో నిర్మించిన మొదటి సినిమానే ఇంతటి భారీ విజయాన్ని సాధించడం ఎంతో ఆనందంగా వుందని నిర్మాతలు చెప్పుకొచ్చారు. డైరెక్టర్‌ కొరటాల శివ అద్భుతంగా రూపొందించి మా బేనర్‌కు ఘన విజయాన్ని అందుకునేలా చేశారని అన్నారు. ఈ సినిమాకి 6 ‘ఐఫా’ అవార్డులు రావడం చాలా హ్యాపీగా వుందన్నారు. ఇటు కలెక్షన్స్… అటు అవార్డులు… అందుకున్న ‘శ్రీమంతుడు’ సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకలను అదిరిపోయే రేంజ్‌లో నిర్వహించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ADVERTISEMENT

అంతే కాదు, గతంలో మహేష్ తో సహా చిత్ర నిర్మాతలు ఈ సినిమా వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. స్థానికంగా ఏపీ, తెలంగాణాల మాట ఎలా ఉన్నా, ఓవర్సీస్ లో కూడా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఒకింత అభిమానులు నిరాశతో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories