తెలుగు బాక్స్ ఆఫిసు వెలవెల

Mr-Majnu-Nidhhi-Agerwalసంక్రాంతి సినిమాల సందడి తరువాత తెలుగు బాక్స్ ఆఫీసు వద్ద ఒక రకమైన నీరసం కనిపిస్తుంది. సంక్రాంతి సినిమాలలో ఒకటి పెద్ద హిట్ అవ్వడం మిగతా మూడూ ఫట్ అయిపోవడంతో ఈ సారి పెద్ద పండగ నిరాశ మిగిలించింది అనే చెప్పాలి. సంక్రాంతి సినిమాల తరువాత విడుదలైన మరో పెద్ద సినిమా అఖిల్ అక్కినేని నటించిన మిస్టర్ మజ్ను కూడా ఘోరమైన పరాజయం వైపు అడుగులు వేస్తుంది. కనీసం మొదటి వారంలో కూడా వసూళ్ళు రాబట్టలేకపోయింది. మరోవైపు ఈ వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు.

రహస్యం, అక్కడొకడుంటాడు వంటి అనామక సినిమాలు విడుదలైన కనీసం మార్నింగ్ షోలకు కూడా జనాలను థియేటర్లకు తీసుకురాలేకపోయారు. ఆల్రెడీ స్లో అయిపోయిన మిస్టర్ మజ్ను ఈ వారాంతంలో చిల్లర కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాదాపుగా 40-50% పెట్టుబడి పోగొట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నాలుగో వారంలో ఉన్న ఎఫ్2 మాత్రమే ఎంతో కొంత వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. దీనితో ఈ వారం కూడా ట్రేడ్ కు పెద్దగా చెప్పుకోదగ్గ కాసులు ఏమీ ముట్టే అవకాశం కనిపించడం లేదు.

ADVERTISEMENT

ఫిబ్రవరి నెలలో విడుదల కాబోయే ఎన్టీఆర్ మహానాయకుడు తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ కనిపించడం లేదు. ఇప్పటివరకు ఎన్టీఆర్ మహానాయకుడు ఎప్పుడు విడుదల అయ్యేది ఆ చిత్రం యూనిట్ చెప్పలేదు. 22న విడుదల కావొచ్చని సమాచారం. ఎన్టీఆర్ కథానాయకుడు పై 50 కోట్లు పోగొట్టుకున్న ట్రేడ్ ఈ చిత్రం మీద భారీ ఆశలే పెట్టుకుంది. అదే సమయంలో కొంత బెరుకుగా కూడా ఉంది. ఆ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించకపోతే 2019లో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నిరుత్సాహవంతమైన స్టార్ట్ వచ్చిందనే అనుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories