మహేష్ బాబుకు మేజర్ సర్జరీ?

Major Surgery to Mahesh babu సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ ప్రమోషన్స్ పూర్తి చేసి కుటుంబసమేతంగా అమెరికా హాలిడేకి వెళ్లారు. తన తరువాతి సినిమా స్క్రిప్ట్ కోసం దర్శకుడు వంశీ పైడిపల్లికి మూడు నెలల సమయం ఇవ్వడంతో ఆయనకు కాస్త బ్రేక్ దొరికింది. అయితే మహేష్ బాబు ఈ గ్యాప్ లో ఒక మేజర్ సర్జరీ చేయించుకోబోతున్నాడు అనే వార్త చక్కర్లు కొడుతుంది.

ఆగడు టైటిల్ సాంగ్ షూటింగ్ సమయంలో మహేష్ బాబు మోకాలుకి గాయం అయ్యిందట. ఆ తరువాత అది ఎక్కువ కావడంతో సైడర్ సమయంలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు మహేష్. అయితే ఇప్పుడు మళ్ళీ గాయం తిరగబెట్టడంతో అమెరికాలో ఒక మేజర్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడట.

ADVERTISEMENT

ఇది ఇలా ఉండగా మహేష్ – వంశీ కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన మహర్షి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. మహర్షి తరువాత వంశీ ఇంకో సినిమా చెయ్యకపోవడం విశేషం. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో డాన్ గా కనిపించబోతున్నాడట.

ఇటువంటి పాత్ర మహేష్ బాబు చెయ్యడం ఇదే తొలి సారి. వచ్చే ఏడాది సంక్రాంతి ఆ సినిమాను విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఒకవేళ సర్జరీ తరువాత మహేష్ బాబు రికవర్ కావడానికి ఆలస్యమైతే మాత్రం సినిమా వేసవికి వెళ్లే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories