హీరోయిన్లు వరుస సక్సెస్ లు సొంతం చేసుకోవడం, ఒకేవారం సదరు హీరోయిన్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం వంటివి చాలా కామన్. అయితే.. మమిత మాత్రం ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి సాధ్యం కానీ ఓ అరుదైన రికార్డ్ సృష్టించింది.
విషయం ఏంటంటే.. ఆగస్ట్ 14న “విశ్వనాథ్ & సన్స్” అనే సినిమాతో మంచి హిట్ అందుకుంది మమిత. సరిగ్గా వారం గ్యాప్ లో ఆగస్ట్ 21న “బెత్లహాం కుటుంబం యూనిట్” అనే మలయాళ చిత్రంతో మరో మంచి హిట్ కొట్టింది మమిత. ఇక్కడ రెండు వారాల్లో రెండు హిట్లు కొట్టడం విశేషం కాదు, రెండు సినిమాల స్టోరీలు ఒకేలా ఉండడం విశేషం.
విశ్వనాథ్ & సన్స్ లో తన కంటే వయసులో 20 ఏళ్లు పెద్దవాడైనా సూర్యను ప్రేమించే పాత్ర పోషించిన మమిత, బెత్లెహాం కుటుంబ యూనిట్ అనే సినిమాలో తనకంటే వయసులో 13 ఏళ్ల పెద్దవాడైన నివిన్ పౌలీని ప్రేమిస్తుంది. రెండు సినిమాల సెటప్ లు వేరే అయినా.. హీరోయిన్ తనకంటే వయసులో పెద్దవాళ్ళని ప్రేమించడం అనేది కామన్ పాయింట్ కావడం ఇక్కడ విశేషం.
రెండు సినిమాల్లోనూ ఆమె కాలేజ్ పిల్లగానే కనిపించడం మరో విశేషం అనుకోండి. అయితే.. విశ్వనాథ్ & సన్స్ లో చాలా చలాకీగా కనిపించిన మమిత, బెత్లహాం కుటుంబ యూనిట్ లో మాత్రం చాలా సైలెంట్ రోల్ ప్లే చేసింది. ఇలా ఒక హీరోయిన్ ఒకే రకమైన క్రక్స్ పాయింట్ ఉన్న రెండు సినిమాలతో హిట్స్ కొట్టడం, అది కూడా వారం గ్యాప్ లో అనేది మాత్రం సరికొత్త రికార్డ్.
ఈ ఊపులోనే మమిత మరో మలయాళం సినిమా సైన్ చేసింది. “ప్రేమలు”లో స్నేహితుడిగా కనిపించిన సంగీత్ ప్రతాప్ ఈ సినిమా హీరో. “హలో డియర్” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాతోపాటుగా మమిత తమిళంలో నాలుగు సినిమాలు, తెలుగులో ఒక సినిమా చేస్తోంది. చూస్తుంటే.. మమిత స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎక్కువ సమయం పట్టేట్లు లేదు.





