మంచు మనోజ్… ఏ పార్టీ నుండి..?

Manchu Manoj tweets on Political entryతనకు రాజకీయాల్లోకి రావాలని వుందని, తిరుపతి కేంద్రంగా ప్రజా సేవను ప్రారంభించి, రాయలసీమ ప్రాంతమంతటికీ విస్తరిస్తానని గత నెలలో అభిమానులకు లేఖ రాసిన మంచు మనోజ్, తన రాజకీయ అరంగేట్రంపై ఇంకాస్త స్పష్టత ఇచ్చాడు. ఓ అభిమాని ట్విట్టర్ వేదిక ద్వారా మనోజ్ ను ప్రశ్నిస్తూ, “అసలు నీ ప్లాన్ ఏంటి, నీ స్కీం ఏంటి, నీ గోల్ ఏంటి?” అని అడుగగా స్పందించాడు.

[m9ad]

ADVERTISEMENT

ఓ ఖాళీగా ఉన్న ప్రదేశంలో దిగిన ఫోటోను జత చేసిన మనోజ్, “పేద విద్యార్ధులు, రైతుల కోసం ఏదో చేయాల‌నుకున్న నా క‌ల ఈ ఖాళీ ప్ర‌దేశం ద్వారా తీర‌బోతుంది” అన్నాడు. తన కల ఇక్కడి నుంచే తీరబోతోందని, తానున్న చోట ఉచిత ఆహారం, క్రీడా సౌకర్యాలు, మంచినీటి వసతి ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు. దీంతో ఏ పార్టీ ద్వారా మంచు మనోజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ADVERTISEMENT
Latest Stories