vishnu-manchu

ఇటీవల మళయాళ సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు మహిళా నటులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వారి పేర్లతో సహా హేమ కమిటీ కేరళ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

Also Read – రాజకీయాలలోకి షాయాజీ షిండే… ఎమ్మెల్యే అనిపించుకుంటే చాలట!

కేరళ ప్రభుత్వం దానిని యధాతధంగా మీడియాకు విడుదల చేసింది. ఆ నివేధిక ఆధారంగా పోలీసులు వారిపై కేసులు కూడా నమోదు చేస్తుండటంతో మళయాళ సినీ పరిశ్రమ పునాదులు కదిలిపోతున్నాయి.

అయితే దేశంలో బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు ప్రతీచోటా ఇదే పరిస్థితి నెలకొని ఉందని పలువురు మహిళా నటులు స్వయంగా చెపుతున్నారు.

Also Read – దువ్వాడ రాజీ ఒప్పందం… జనసేనకు ఓకేనా?

పేరు మోసిన మహిళా నటులు సైతం తాము ఏదో సందర్భంగా లైంగిక వేధింపులకు గురయ్యామని చెపుతూనే ఉంటారు. కానీ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయరు కనుక వారి మాటలు ‘సినీ గాసిప్స్’గా మిగిలిపోతుంటాయి.

కేరళ ప్రభుత్వం మళయాళ సినీ పరిశ్రమకి ఏర్పాటు చేసిన హేమ కమిటీ వంటిదే తెలుగు సినీ పరిశ్రమకి కూడా ఏర్పాటు చేయాలని కోరుతూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో మహిళలకు భద్రతకి ‘మా’ కట్టుబడి ఉంటుందని మంచు విష్ణు ట్వీట్‌ చేశారు.

Also Read – విశ్వంభర VFX ఎక్కడ తేడా కొట్టింది?

మంచు విష్ణు ఉద్దేశ్యం మంచిదే కానీ అతను నిజంగా ఆ ఉద్దేశ్యంతోనే కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని కోరారా? అనే సందేహం కలుగుతుంది.

గత కొన్నేళ్ళుగా మంచు విష్ణు, ఆయన తండ్రి మంచు మోహన్ బాబు చేస్తున్న సినిమాలు బోల్తా పడుతున్నాయి. అయితే ఆ సినిమాలలో బలం లేకపోవడం వలన కాక, ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులు తమపై పగబట్టి తమ సినిమాలను దెబ్బ తీస్తున్నారంటూ మంచువిష్ణు కొన్ని నెలల క్రితం సంచలన ఆరోపణలు చేశారు.

సినీ పరిశ్రమలో ఉన్న మంచు విష్ణుకి ఎవరెవరు ఎటువంటివారో, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నవారు ఎవరో తెలియకుండా ఉండదు. కనుక తమని దెబ్బ తీస్తున్న అటువంటివారిపైకి మంచు విష్ణు ఈ బ్రహ్మాస్త్రం సందించిన్నట్లున్నారు అని అనిపిస్తుంది.

ఈ ప్రతిపాదనను ఆయనను దెబ్బ తీస్తున్నవారు కూడా వ్యతిరేకించలేరు. కనుక అందరూ స్వాగతించాల్సిందే. సినీ పరిశ్రమ తరపున మంచు విష్ణు అభ్యర్ధనపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసి విచారణ జరిపిస్తే ఏమవుతుందో మళయాళ సినీ పరిశ్రమని చూస్తే అర్దమవుతుంది.




కనుక సినీ పరిశ్రమలో మంచు విష్ణు ప్రత్యర్ధులు కూడా కమిటీ ఏర్పాటు చేయకుండా పావులు కదపవచ్చు. కదిపి బయటపడితే అపవాదు భరించాల్సి ఉంటుందని అనుకుంటే మంచు విష్ణు ప్రయోగిస్తున్న ఈ బ్రహ్మాస్త్రాన్ని కాసుకోవడానికి సిద్దంకాక తప్పదు.