మంగళగిరిలో లోకేష్ కు దక్కిన అదృష్టం..?

ఈ రోజు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సందర్భంగా నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకోబోతుంది. లోకేష్ పోటీ చేయబోతున్న మంగళగిరి నియోజకవర్గం వైసీపీ పార్టీ అధినేత, సాక్ష్యాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసముంటున్న ప్రాంతం.

దానికి తోడు రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించిన భూభాగంలో మంగళగిరి ప్రాంతం ఒకటి. అలాగే టీడీపీ అధినేత, తన తండ్రి చంద్రబాబు నాయుడు, తమ మిత్ర పక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమ ఓటు హక్కును మంగళగిరిలోనే వినియోగించుకోనున్నారు.

ADVERTISEMENT

చంద్రబాబు ఉండవల్లి ప్రాంతంలోనూ, పవన్ మంగళగిరిలోను తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఒక పార్టీ అధినేతగా ఉంటూ తన పార్టీ సింబల్ పై కాకుండా మరో పార్టీకి ఓటేస్తున్నారు పవన్. పవన్ ఇక్కడ నుంచి రెండో సారి ఓటు హక్కుని వినియోగించుకోవడం, రెండు సార్లు ఇక్కడ గాజు గ్లాస్ గుర్తు లేకపోవడం జనసేన అభిమానులకు నిరాశనే కలిగిస్తుంది.

అయితే ఇక్కడ కూటమి తరుపున బరిలో ఉన్నది టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ కావడంతో తనతో పాటుగా రెండు పార్టీల అధినేతల ఓట్లను తన ఖాతలో వేసువడంతో లోకేష్ ఒక అరుదైన రికార్డు ను సృష్టించినట్టయ్యింది. అలాగే కుప్పం నుండి పోటీ చేస్తున్న చంద్రబాబు కూడా తన కుమారుడు పోటీలో ఉన్న మంగళగిరిలోనే తన ఓటును రిజిస్టర్ చేసుకున్నారు. ఇలా ఇద్దరు అధినేతలు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాకుండా మంగళగిరిలో ఓటు వేయడం లోకేష్ కు దక్కిన అదృష్టంగానే భావించాలి.

టీడీపీ, జనసేన, వైసీపీ మూడు ప్రాంతాల అధినేతల నివాస స్థలంగా, రాజధాని ప్రాంతంగా, రెండు పార్టీల అధినేతలకు ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం గా నిలిచిన మంగళగిరి నిజంగా లోకేష్ కు వచ్చిన మంచి అవకాశంగానే భావించాలి. దీనితో ఒకప్పుడు టీడీపీ జెండా పట్టుకున్న బలమైన నాయకుడు లేని మంగళగిరి ఇప్పుడు టీడీపీకి కంచుకోట కానుందా..?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Hanuman Ansh Telugu Flops: What Went So Horribly Wrong?

Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…

11 minutes ago

విజయ్‌ మొహం ఎప్పుడూ ఇంతేనా? కాస్త నటించొచ్చుగా?

ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై…

19 minutes ago