చిరంజీవి కోసం మణి శర్మ విశ్వరూపం

Manisharma music for Chiranjeevi - Koratala siva movieమెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా కంఫర్మ్ అయ్యారు. గతంలో చిరంజీవి సెన్సషనల్ ఆల్బమ్స్ ఇచ్చిన మణి శర్మ చాలా సంవత్సరాలు ఫామ్ సమస్యలతో సతమతం అయ్యారు. ఇటీవలే ఆయన రామ్ పూరి జగన్నాధ్ ల ఇస్మార్ట్ శంకర్ తో కమ్ బ్యాక్ ఇచ్చారు. దీనితో ఆయన మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చారు.

ADVERTISEMENT

చిరంజీవి సినిమా అంటే పెద్ద అవకాశం దీనితో ఒక బ్లాక్ బస్టర్ ఆల్బం ఇవ్వడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారట. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆయన మూడు ట్యూన్స్ పూర్తి చేశారట. ఈ మూడూచిరంజీవికి బాగా నచ్చాయని సమాచారం. ఇది ఇలా ఉండగా జనవరి 3 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది.

ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఎలా ఉండాలనే అంశంపై కొరటాల చాలా కసరత్తులు చేశాడు. ఫైనల్ గా చిరంజీవి లుక్ టెస్ట్ ముగిసింది. అన్నపూర్ణ స్టుడియోలో చిరంజీవిపై నిర్వహించిన ఫొటోషూట్ లో అతడి లుక్ ను ఫిక్స్ చేశారు. హైదరాబాద్ లో జరిగే మొదటి షెడ్యూల్ లో చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్లు, ఒక పాట చిత్రీకరిస్తారట.

ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories