మళ్ళీ ‘మహేష్ బాబు – మణిశర్మ’ కాంభినేషన్!

Manisharma music for mahesh babu next movie‘రాజకుమారుడు’ నుండి ‘శ్రీమంతుడు’ వరకు ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 21 సినిమాలలో 11 చిత్రాలకు సంగీతం అందించిన ఘనత మణిశర్మది. వీరిద్దరి కాంభినేషన్ లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయేమో గానీ, సంగీత ప్రియులను మాత్రం విశేషంగా అలరించాయి. “ఖలేజా” సినిమా తర్వాత కలువని ఈ హిట్ కాంభినేషన్ ను శ్రీకాంత్ అడ్డాల సెట్ చేయబోతున్నారని సమాచారం.

“బ్రహ్మోత్సవం” సినిమా ద్వారా మరోసారి మహేష్ – మణి కాంభినేషన్ తెరపైకి రాబోతుందట. ఈ సినిమాకు స్వరాలు అందించే బాధ్యతను మిక్కీ జే మేయర్ నిర్వర్తిస్తుండగా, నేపధ్య సంగీతాన్ని మణిశర్మ అందించాబోతున్నారట. ఈ దిశగా నిర్మాత పివిపి ఇప్పటికే మణితో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించడంలో మణికున్న పేరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! ఈ వార్త పట్ల ప్రిన్స్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories