భార్య వేధింపులకు సినీ నిర్మాత సూసైడ్!

Marathi film producer Atul Tapkir commits Suicideభార్య వేధింపులు భరించలేక ప్రముఖ మరాఠీ చిత్ర నిర్మాత అతుల్ తాప్‌ కీర్ ఆత్మహత్య చేసుకున్నారు. పూణేలోని హోటల్ ప్రెసిడెంట్‌లో శుక్రవారం రాత్రి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు అతుల్ తన ఆవేదనను ఫేస్‌ బుక్ ద్వారా పంచుకున్నారు. మిత్రులకు నమస్కారం… నేను అతుల్ తాప్‌కీర్. ఇటీవల ‘డోల్ తాశే’ అనే సినిమాను నిర్మించా. అందులో వచ్చిన నష్టాలు నన్ను కుంగదీశాయి.

ADVERTISEMENT

ఈ సినిమా నాకు స్ఫూర్తినిచ్చినా ఆర్థికంగా మాత్రం కుంగిపోయా. ఇదే విషయం నాన్న, అక్కయ్యలకు చెబితే వారు కొంత సాయం చేశారు. కానీ నా భార్య ప్రియాంక మాత్రం నన్ను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టింది. నన్నే కాదు… నా తండ్రిని కూడా… అని అతుల్ పేర్కొన్నారు. భార్య వేధింపులు భరించలేకే తనువు చాలిస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పూణే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ADVERTISEMENT
Latest Stories